బాలీవుడ్‌లో హనుమంతుడిపై పూర్తి AI సినిమా తెరకెక్కనుంది. విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం నిర్మాతలుగా ‘చిరంజీవి హనుమాన్’ టైటిల్‌తో ఈ యానిమేషన్ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది హనుమాన్ జయంతి కానుకగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కాంతార:చాప్టర్ 1’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న మూవీ ‘కాంతార:చాప్టర్ 1’. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్‌కానుంది. ఈనేపథ్యంలో సినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో నటుడు గుల్షన్ దేవయ్య ‘కులశేఖర’ పాత్రలో నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
-
‘#90s’ సిరీస్‌కు అవార్డులు పంట
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ‘#90s:ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్ 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఓటీటీ విభాగంలో ఈ సిరీస్‌కి.. దీన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హాసన్, బాల నటుడు రోహన్ రాయ్‌కు మొత్తం పురస్కారాలు దక్కాయి. ఈ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్‌లో ఇటీవల జరిగింది.
-
‘గ్రేజియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై సమంత
గ్లామర్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి సమంత, ఇప్పుడు గ్రేజియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసింది. ఈ ప్రఖ్యాత మ్యాగజైన్ తన తాజా సంచిక కవర్ పేజీపై సమంత ఫొటోను ప్రచురించింది. ఈ కవర్ ఫొటోషూట్‌లో సమంత స్టైలిష్‌గా, ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది, అభిమానులందరినీ ఆకట్టుకుంది. దీని ద్వారా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఆమెకు ఉన్న ప్రాముఖ్యత మరోసారి స్పష్టమైంది.
-
కమల్-రజనీ కాంబోలో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
తమిళ స్టార్స్ రజనీకాంత్, కమల్‌హాసన్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని టాక్. మరి ఇదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లుతాయని అభిమానులు అంటున్నారు. అయితే ఈ క్రేజీ మూవీపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. కాగా లోకేశ్ ఇప్పటికే కమల్‌తో ‘విక్రమ్’, రజినీతో ‘కూలీ’ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
-
తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
AP: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటుడు ప్రియదర్శి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
-
ఈ కథ షారుక్‌కు చెప్పా.. కానీ: మురుగదాస్
శివ కార్తికేయన్-ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ‘మదరాశి’. సెప్టెంబర్ 5న విడుదలకానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ.. ‘‘7ఏళ్ల క్రితమే ఈ కథను షారుక్‌ఖాన్‌కు చెప్పా. ఆయన ఈ లైన్ చాలా నచ్చింది. కాకపోతే అప్పటికి నేను పూర్తిగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకోలేదు. రెండువారాల తర్వాత ఆయనకు మెసేజ్ చేశాను. సరైన స్పందన రాలేదు. అప్పుడే శివకార్తికేయన్‌తో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు.
-
‘బార్బరిక్’ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!
సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈమూవీ ఆగస్టు 22న విడుదల కావాల్సి ఉండగా.. సరిపడా థియేటర్లు లభించకపోవడంతో ఆగస్టు 29కి వాయిదా వేశారు.
-
ఆర్.నారాయణమూర్తిపై బ్రహ్మానందం ఆసక్తికర కామెంట్స్!
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’. ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్.నారాయణమూర్తితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
-
ప్రభాస్ మూవీలను దాటేసిన ‘మహావతార్ నరసింహా’
‘మహావతార్ నరసింహా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీలో ప్రభాస్ నటించిన ‘సాహో’ (రూ.150 కోట్లు), ‘సలార్’ (రూ.153 కోట్లు) లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం 25 రోజుల్లోనే అధిగమించి రూ.160 కోట్లు వసూలు చేసింది. ఇదే ఊపు కొనసాగితే త్వరలో రూ.200 కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.