సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈమూవీ ఆగస్టు 22న విడుదల కావాల్సి ఉండగా.. సరిపడా థియేటర్లు లభించకపోవడంతో ఆగస్టు 29కి వాయిదా వేశారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఆర్.నారాయణమూర్తిపై బ్రహ్మానందం ఆసక్తికర కామెంట్స్!
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’. ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్.నారాయణమూర్తితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
-
ప్రభాస్ మూవీలను దాటేసిన ‘మహావతార్ నరసింహా’
‘మహావతార్ నరసింహా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీలో ప్రభాస్ నటించిన ‘సాహో’ (రూ.150 కోట్లు), ‘సలార్’ (రూ.153 కోట్లు) లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం 25 రోజుల్లోనే అధిగమించి రూ.160 కోట్లు వసూలు చేసింది. ఇదే ఊపు కొనసాగితే త్వరలో రూ.200 కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.
-
‘అఖండ-2’ వాయిదా?
నటుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘అఖండ-2’ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజున పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ రిలీజ్ కానుండటంతో పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ‘అఖండ-2’ వాయిదా పడితే, డిసెంబర్‌లో విడుదల కావొచ్చని సమాచారం. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
-
రజనీకాంత్, కమల్‌హాసన్‌తో లోకేశ్ కనకరాజ్ మూవీ!
తమిళ స్టార్ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ ఒకే సినిమాలో కలిసి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. RKFI ప్రొడక్షన్‌లో లోకేశ్ కనకరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ‘2 ఏజింగ్ గ్యాంగ్‌స్టర్స్’ గురించి ఈ సినిమా స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కొవిడ్‌కు ముందే పట్టాలెక్కాల్సి ఉందని తమిళ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
-
‘థామా’ సినిమా టీజర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘థామా’. ఈ మూవీకి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో టీమ్ విడుదల చేసింది. గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ చిత్రంగా దీన్ని రూపొందించినట్లు టీజర్ ఆధారంగా తెలుస్తోంది. హారర్ నేపథ్యం ఉన్నప్పటికీ ప్రేమే ముఖ్య కథాంశంగా ఇది ముస్తాబవుతోంది.
-
సోషల్‌మీడియా నుంచి బయటకు రండి: ఐశ్వర్యారాయ్
నటి ఐశ్వర్యారాయ్ సోషల్‌మీడియా వినియోగం గురించి మాట్లాడారు. ‘‘మన విలువను ఏదీ నిర్ణయించలేవు. సోషల్‌మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్‌లు ఇవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు. దాన్ని దాటి చూసినప్పుడే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మగౌరవం సోషల్‌మీడియాలో దొరకదు’’అని తెలిపారు.
-
బిగ్‌బాస్‌లోకి అనసూయ.. క్లారిటీ ఇదే!
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి నటి, యాంకర్ అనసూయ హౌస్‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్వయంగా స్పందించారు. బిగ్‌బాస్‌లో తాను పాల్గొనడం లేదని, కుటుంబాన్ని అంతకాలం వదిలి ఉండలేనని ఆమె స్పష్టం చేశారు
-
రాధేశ్యామ్ పరాజయం: డిస్ట్రిబ్యూటర్లకు రూ.50 కోట్లు తిరిగిచ్చిన ప్రభాస్
‘రాధేశ్యామ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో హీరో ప్రభాస్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు రావడంతో, వారి అభ్యర్థన లేకుండానే ప్రభాస్ తన పారితోషికంలో రూ.50 కోట్లు తిరిగి ఇచ్చినట్లు ఓ వ్యక్తి చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ సంఘటన ప్రభాస్ వ్యక్తిత్వాన్ని, నిర్మాత పట్ల అతనికున్న గౌరవాన్ని చాటిచెప్పింది.
-
16వ రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసన
HYD: సినీ కార్మికుల నిరసన మంగళవారంతో 16వ రోజుు చేరుకుంది. సినీ కార్మికుల ఐక్యవేదిక పేరుతో నేడు ఇందిరానగర్‌లో పెద్దఎత్తున సినీ కార్మికుల నిరసన వ్యక్తం చేయనున్నారు. అనతరం సమస్యలు పరిష్కరించబడాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయనున్నారు సినీ కార్మికులు.