Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • పవన్ కళ్యాణ్‌పై హైకోర్టులో పిటిషన్

    AP: మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “హరిహర వీరమల్లు” సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులను పవన్ వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. హైకోర్టు ఈ కేసు విచారణ బాధ్యతలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

  • ‘నాకు రూ.101 జీతమే ఇచ్చారు’

    ప్రముఖ గాయని కనికా కపూర్‌ భారతీయ గాయకులకు చెల్లించే పారితోషికంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పాటలకు కేవలం రూ.101 మాత్రమే ఇస్తున్నారని, తాను కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నానని ‘బంక్ విత్ ఉర్ఫీ’ యూట్యూబ్ షోలో తెలిపారు. ఈ విషయాన్ని నిరూపించడానికి అవసరమైతే కాంట్రాక్టులను చూపించడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. భారత్‌లో చాలా మంది ప్రముఖ సింగర్లకు కూడా సరైన పారితోషికం లభించడం లేదని  ఆమె అన్నారు.

  • కూలీలో నాగార్జున స్వాగ్‌కు తమిళ ఫ్యాన్స్ ఫిదా

    ‘కూలీ’ సినిమాలో విలన్‌గా నాగార్జున స్వాగ్‌కు తమిళ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘రక్షకుడు’ చిత్రంలోని లుక్‌‌లో ఆయన అదరగొట్టారని ప్రశంసిస్తున్నారు. అయితే, తెలుగు అభిమానులు మాత్రం ఆయన పాత్రకు ప్రాధాన్యత తక్కువగా ఉందని నిరాశ చెందుతున్నారు. మిశ్రమ స్పందనలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం కలెక్షన్లలో దూసుకుపోతోంది. నాగార్జున నటనపై తెలుగు, తమిళ ప్రేక్షకుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • ‘మహావతార్‌ పరశురామ్‌’ సినిమా తీస్తా: అశ్విన్‌ కుమార్‌ 

    ఎవరూ ఊహించని రీతిలో కలెక్షన్స్‌ రాబట్టి, ఔరా అనిపించింది యానిమేషన్‌ మూవీ ‘మహావతార్‌ నరసింహ’. ఈ సినిమా విజయంపై దర్శకుడు అశ్విన్‌ కుమార్‌   ఆనందం వ్యక్తం చేశారు. తన తదుపరి చిత్రం  ‘మహావతార్‌ పరశురామ్‌’ అని ప్రకటించారు. నవంబర్‌లో దీని పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

     

  • అలాంటివి మా నాన్నను ప్రభావితం చేయలేవు: శ్రుతి హాసన్‌

    ‘కూలీ’, ‘థగ్ లైఫ్‌’ ఫలితాలపై నటి శ్రుతి హాసన్ స్పందించారు. పదేళ్ల క్రితం నంబర్స్‌ గురించి ఎవరూ ఆలోచించేవారు కాదన్నారు. ఇలాంటి సినిమా తన తండ్రి కమల్‌హాసన్‌ను ప్రభావితం చేయలేదన్నారు.

  • ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ నటుడు అచ్యుత్ పోత్దార్(91) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల థానేలోని జూపిటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమాల్లో తనదైన ముద్ర వేయడానికి ముందు, అచ్యుత్ పోత్దార్.. భారత సాయుధ దళాలలో పనిచేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా 125 హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. ఆమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమాలో ఆయన పోషించిన ప్రొఫెసర్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

  • అందుకే హలీవుడ్‌ అవకాశాన్ని వదులుకొన్నా: ఫహాద్‌ ఫాజిల్‌

    ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్‌ ఇనారిటుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ చెప్పారు. అయితే ఆయనతో ఆ అవకాశాన్ని యాస కారణంగా తాను తిరస్కరించానని వెల్లడించారు. ఇంగ్లిషులో తాను డైలాగ్స్ చెప్పాల్సిన విధానం కోసం నాలుగు నెలలు అమెరికాలో ఉండాల్సి ఉంటుందని, ఆ సమయంలో ఎటువంటి జీతం ఉండదు కాబట్టి ఆ అకాశాన్ని వదులుకున్నానని చెప్పారు.

  • ఛాన్సుల్లేవని స్ట్రగుల్ అయ్యా: ఆర్ నారాయణమూర్తి

    ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘యూనివర్సిటీ’ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆయన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించారు. హీరో వేషాలు రాకపోవడంతో నేనెప్పుడు హీరో అవుతాను? నా ముఖం నా వాళ్లందరికీ ఎలా చూపించుకోవాలని బాధ పడిన రోజులను గుర్తు చేసుకున్నారు.

  • 50 ఏళ్లుగా యాడ్‌లో నటించని రజినీకాంత్

    రూ.కోట్లు ఇస్తానని వ్యాపారులు ఆఫర్ చేసినా, సినీ నటుడు రజినీకాంత్ ఇప్పటివరకు ఒక్క యాడ్‌లో కూడా నటించలేదు. దీని గురించి ఓ ఇంటర్వూలో అడగ్గా.. “నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారు. వాటిలోని లోటుపాట్లకి నేను బాధ్యుడిని అవుతాను. కాబట్టి ఆ సంపాదన నాకొద్దు” అని రజినీ తెలిపారు. కానీ 1980లో పల్స్ పోలియో, నేత్రదానం, సహా మరో యాడ్లలో ఆయన ఉచితంగా నటించారు.

  • ‘NC25’ రెడీ.. డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?

    అక్కినేని నాగచైత్య తన 25వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ మూవీని కొరటాల డైరెక్షన్‌లో చెయ్యబోతున్నట్ల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ దాదాపు సెట్ అయినట్లు టాక్. ఇందులో హీరోయిన్‌గా మమితా బైజుని ఫిక్స్ చేశారట. ఈ సినిమా సోషల్ థ్రిల్లర్‌తో కూడిన కాలేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.