Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ నటుడు అచ్యుత్ పోత్దార్(91) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల థానేలోని జూపిటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమాల్లో తనదైన ముద్ర వేయడానికి ముందు, అచ్యుత్ పోత్దార్.. భారత సాయుధ దళాలలో పనిచేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా 125 హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. ఆమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమాలో ఆయన పోషించిన ప్రొఫెసర్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

  • అందుకే హలీవుడ్‌ అవకాశాన్ని వదులుకొన్నా: ఫహాద్‌ ఫాజిల్‌

    ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్‌ ఇనారిటుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ చెప్పారు. అయితే ఆయనతో ఆ అవకాశాన్ని యాస కారణంగా తాను తిరస్కరించానని వెల్లడించారు. ఇంగ్లిషులో తాను డైలాగ్స్ చెప్పాల్సిన విధానం కోసం నాలుగు నెలలు అమెరికాలో ఉండాల్సి ఉంటుందని, ఆ సమయంలో ఎటువంటి జీతం ఉండదు కాబట్టి ఆ అకాశాన్ని వదులుకున్నానని చెప్పారు.

  • ఛాన్సుల్లేవని స్ట్రగుల్ అయ్యా: ఆర్ నారాయణమూర్తి

    ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ‘యూనివర్సిటీ’ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆయన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించారు. హీరో వేషాలు రాకపోవడంతో నేనెప్పుడు హీరో అవుతాను? నా ముఖం నా వాళ్లందరికీ ఎలా చూపించుకోవాలని బాధ పడిన రోజులను గుర్తు చేసుకున్నారు.

  • 50 ఏళ్లుగా యాడ్‌లో నటించని రజినీకాంత్

    రూ.కోట్లు ఇస్తానని వ్యాపారులు ఆఫర్ చేసినా, సినీ నటుడు రజినీకాంత్ ఇప్పటివరకు ఒక్క యాడ్‌లో కూడా నటించలేదు. దీని గురించి ఓ ఇంటర్వూలో అడగ్గా.. “నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారు. వాటిలోని లోటుపాట్లకి నేను బాధ్యుడిని అవుతాను. కాబట్టి ఆ సంపాదన నాకొద్దు” అని రజినీ తెలిపారు. కానీ 1980లో పల్స్ పోలియో, నేత్రదానం, సహా మరో యాడ్లలో ఆయన ఉచితంగా నటించారు.

  • ‘NC25’ రెడీ.. డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?

    అక్కినేని నాగచైత్య తన 25వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ మూవీని కొరటాల డైరెక్షన్‌లో చెయ్యబోతున్నట్ల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ దాదాపు సెట్ అయినట్లు టాక్. ఇందులో హీరోయిన్‌గా మమితా బైజుని ఫిక్స్ చేశారట. ఈ సినిమా సోషల్ థ్రిల్లర్‌తో కూడిన కాలేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  • ఆ రూల్స్‌తో సినిమాలు నిర్మించడం కష్టం: నిర్మాతలు

    సినీ కార్మికుల వేతనాలు పెంచడాన్ని చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్‌ తెలిపారు. 50 ఏళ్ల నాటి యూనియన్‌ రూల్స్‌తో ప్రస్తుత నిర్మాతలు సినిమాలు తీయలేరని అభిప్రాయపడ్డారు. కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై రెండు వారాలుగా యూనియన్లు, ఫిల్మ్‌ ఫెడరేషన్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాతల అభిప్రాయాలను SKN పోస్ట్ ద్వారా తెలిపారు.

     

  • ‘ది ప్యారడైజ్’.. నాని పాత్రపై క్రేజీ బజ్!

    నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.ఇందులో నాని మొత్తం మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడని.. అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒకటి అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుందని టాక్. దీంతో ఇందులో నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • ‘కూలీ’ రికార్డ్.. 4రోజుల్లో రూ.404 కోట్లు!

    సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈమూవీ 4రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.404 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

  • Video: పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ డైరెక్టర్

    ‘కోర్ట్’ మూవీ దర్శకుడు రామ్ జగదీశ్ పెళ్లి పీటలెక్కాడు. వైజాగ్‌లో కార్తీక అనే అమ్మాయిని ఆయన సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకలో ‘కోర్ట్’ చిత్రం నటీనటులు హాజరయ్యారు. అయితే తన పెళ్లి ఫొటోలను రామ్ షేర్ చేయనప్పటికీ.. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ పెళ్లి చేసుకున్నది ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. పెద్దలు కుదిర్చిన సంబంధం అని తెలుస్తోంది.

  • ‘హరిహర వీరమల్లు’.. ఓటీటీ రిలీజ్ అప్పుడే?

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ జులై 24న థియేటర్స్‌లో రిలీజై యావరేజ్‌గా నిలిచింది. అప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈమూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకోగా.. ఈనెల 22 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కానున్నట్లు ఓ ఓటీటీ సంస్థ ప్రకటించింది. అయితే అఫీషియల్‌గా ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు.