Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • భార్యకు వేధింపులు.. హీరోపై కేసు నమోదు

    ‘సిందూరం’ (2023), ‘డ్రింకర్‌ సాయి’ చిత్రాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్‌పై కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ మహేశ్‌, కుటుంబ సభ్యులపై నటుడి భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వరకట్నం వేధింపులకు సంబంధించి గతంలో ధర్మ మహేశ్‌కు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

  • గ్లామర్ డాల్‌గా వెంకీ చిన్న కూతురు!

    ‘దృశ్యం’లో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తర్ అనిల్.. ఇప్పుడు గ్లామర్ డాల్‌గా మారింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫొటో నెట్టింట వైరలవుతోంది.

  • ‘ఘాటి’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    అనుష్క-విక్రమ్‌ ప్రభు జంటగా నటిస్తోన్న ‘ఘాటి’ మూవీపై మేకర్స్‌ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు. ఈ సినిమాలోని ‘దస్సోరా’ సెకండ్‌ సాంగ్‌ను ఆగస్టు 20న లాంచ్‌ చేయనున్నట్టు ప్రకటించారు.

  • చిరంజీవితో ముగిసిన ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశం

    తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సినీ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు, కార్మికుల సంక్షేమం, కొత్త వేతనాల విషయంలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. దీనికి పరిష్కారం కోసం రేపు సా.4గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో మరో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

  • హాట్ లుక్‌లో రకుల్.. పిక్ వైరల్!

    బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా హాట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. పింక్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో ఉన్న రకుల్ ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది.

  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు

    71వ జాతీయ చలన చిత్ర అవార్డులు పొందిన అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్ వంటి సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. హైదరాబాదును భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా నిలపాలని రేవంత్ అన్నారు. దీనికోసం సినిమా రంగానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని తెలిపారు.

  • సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పరదా’

    అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘పరదా’. ఈనెల 22న రిలీజ్‌కాబోతున్న ఈమూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈసినిమాకు సెన్సార్‌బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

  • కోట శ్రీనివాసరావు సతీమణీ రుక్మిణి మృతి

    దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి రుక్మిణి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఇటీవల కోట చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి చనిపోవడం వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  • భయపెట్టేందుకు వస్తున్న రష్మిక.. ‘థమా’ ఫస్ట్ లుక్

    అయుష్మాన్ ఖురానా-రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ మూవీ ‘థమా’. ఆదిత్య సర్పోట్దార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ క్యారెక్టర్స్‌కు సంబంధించిన లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

  • అందరికీ క్షమాపణలు చెప్పిన హీరోయిన్.. ఎందుకంటే?

    సుహాస్‌-శివానీ నగరం జంటగా నటిస్తోన్న చిత్రం ‘హే భగవాన్‌’. గోపి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా జరిగిన ఈ మూవీ టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరోయిన్ శివానీ మాట్లాడుతూ.. అందరికీ క్షమాపణలు చెప్పింది. మరి ఆమె ఎందుకు స్వారీ చెప్పిందో ఈ వీడియోలో చూసేయండి.