Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘పాతాళ్‌ లోక్‌’ డైరెక్టర్‌తో మరో క్రైమ్‌ థ్రిల్లర్‌

    ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మరో ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను ప్రకటించింది. నటుడు అలీ ఫజల్‌ కీలక పాత్రలో రూపొందుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రాఖ్‌’. ఈ సిరీస్‌ను అనూష నందకుమార్‌, సందీప్‌ సాకేత్‌లతో కలిసి ‘పాతాళ్‌లోక్‌’ సిరీస్‌ దర్శకుడు ప్రొసిత్‌ రాయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌ వచ్చే ఏడాది స్ట్రీమింగ్‌ రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ వేదిక పోస్టర్‌ను పంచుకుంది.

  • చిరు చేయలేకపోయారు.. అందుకే చరణ్‌తో చేయించా!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’లోని ఓ సన్నివేశం తన ఆలోచనలను ఎలా ప్రభావితం చేసిందో దర్శకుడు SS.రాజమౌళి ఓ సందర్భంటో వివరించారు. సినిమాలో చిరంజీవి గుర్రం సహాయంతో ఇసుక ఊబిలో నుంచి బయటపడిన తర్వాత, ఆ గుర్రాన్ని పట్టించుకోకపోవడం తనను నిరుత్సాహపరిచిందన్నారు. అందుకే ‘మగధీర’ సినిమాలో గుర్రానికి కృతజ్ఞతలు తెలిపే సన్నివేశాన్ని జోడించానని తెలిపారు.

  • ‘ఆ సినిమాను నా జీవితంలో మర్చిపోలేను’

    సుహాస్‌ ప్రధాన హీరోగా నటిస్తున్న చిత్రం ‘హే భగవాన్‌’. ఇందులో సీనియర్ నటుడు నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా జరిగిన ఈమూవీ టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. కొన్ని సినిమాలను అంగీకరించాలంటే డేట్స్ సర్దుబాటు చేయలేనేమోనని భయమేస్తుందన్నారు. ‘సామజవరగమన’ కథ విన్నాక నాకు అందులో నటించడానికి డేట్స్ లేక చేయలేనని చెప్పా. ఆ సినిమాను నా జీవితంలో మర్చిపోలేను’’ అని తెలిపారు.

  • సూర్య మూవీలో బాలీవుడ్‌ స్టార్.. డైరెక్టర్ క్లారిటీ!

    కోలీవుడ్‌ హీరో సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో ఓ సినిమా రాబోతోంది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అనిల్ కపూర్‌ నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని దర్శకుడు ఖండించారు.. ‘‘మేము అనిల్‌కపూర్‌ను కలవలేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. కానీ, ఈ రూమర్స్‌ ఎలా పుట్టుకొచ్చాయో మాకు తెలియడం లేదు. ఇలాంటి వార్తలు నమ్మకండి. అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్‌ చేయండి’’ అని వెల్లడించారు.

  • రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ‘కానిస్టేబుల్‌ కనకం’

    వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ప్రశాంత్‌ కుమార్ దర్శకుడు. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ సిరీస్‌గా గతవారం స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వెబ్‌సిరీస్‌ 100+మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ దాటి మరింత మందికి చేరువ అవుతోందని తెలుపుతూ ఈటీవీ విన్‌ సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.

  • చిరంజీవి – అనిల్‌ రావిపూడి సినిమా టైటిలేంటి?

    చిరంజీవి – అనిల్‌ రావిపూడి   కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. #MEGA157 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారు.  అయితే చిత్రబృందం ఇటీవల ఓ  టీవీ కార్యక్రమంలో ‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం’, ‘BOSSతో ఈ పండగ రఫ్ఫాడిస్తున్నాము’, ‘మన శివ శంకర వరప్రసాద్‌ గారు’  మూడు పేర్లను ప్రకటించింది. అయితే  ఈ మూడింటిలో ఏది టైటిల్‌ అవ్వొచ్చో కామెంట్ చేయండి.

     

  • సినిమా షూటింగ్‌లో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత

    ఒక సినిమా యూనిట్‌లోని 100కు పైగా కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన లడఖ్‌లోని లేహ్‌లో చోటు చేసుకుంది. ఓ బాలీవుడ్ ఫిల్మ్ షూటింగ్‌లో ఆదివారం రాత్రి దాదాపు 600 మంది భోజనం చేశారు. అనంతరం 100 మందికి పైగా కార్మికులు తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని డాక్టర్ తెలిపారు.

  • నాకు మందు తాగే అలవాటు ఉంది: సంయుక్త మీనన్

     హీరోయిన్ సంయుక్త మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు మద్యం సేవించే అలవాటు ఉందని చెప్పారు. అయితే.. రోజూ కాదని, కేవలం తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళనగా అనిపించినప్పుడు మాత్రమే మానసిక ప్రశాంతత కోసం కొద్దిగా మద్యం తీసుకుంటానని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

     

     

  • ప్రముఖ నటుడు కన్నుమూత

    ప్రముఖ బ్రిటిష్ నటుడు టెరెన్స్ స్టాంప్ (87) కన్నుమూశారు. లండన్‌లో జన్మించిన స్టాంప్ తన సినీ జీవితాన్ని 1962లో వచ్చిన సముద్రయాన చిత్రం ‘బిల్లీ బడ్’తో ప్రారంభించారు. 1978లో వచ్చిన ‘సూపర్‌మ్యాన్’ సినిమాలో గడ్డం ఉన్న జోడ్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించి.. ప్రజాదరణ పొందారు. 2021లో వచ్చిన ‘లాస్ట్ నైట్ ఇన్ సోహో’ సినిమాలో ఆయన చివరిసారిగా నటించారు.

  • కూలీ vs వార్ 2- ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

    ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్ 2’,  రజనీకాంత్ న్యూ మూవీ ‘కూలీ’   ఆగస్టు 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. సక్సెస్​ఫుల్​గా తొలి వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి.  ఈ క్రమంలో తొలి వీకెండ్​లో ‘వార్ 2’ మూవీ వరల్డ్​వైడ్​గా రూ.275.74 కోట్లు గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రైడ్ అనలిస్ట్​లు చెబుతున్నారు. ఇక  కూలీ మూవీ వరల్డ్​వైడ్​గా రూ.397 కోట్ల గ్రాస్​ రాబట్టినట్లు తెలుస్తోంది.