Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ నిశ్చితార్థం?

    సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఘనంగా ఆయన ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని తెలుస్తోంది. రాహుల్‌కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని తెలుస్తుంది. ఆగష్టు 17న తన స్నేహితులతో​ పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో వారి నిశ్చితార్థం జరిగిందని సమాచారం. అయితే అధికారికంగా వారు ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదు. కానీ సోషల్‌మీడియాలో ఇవి వైరల్‌ అవుతున్నాయి.

  • ‘రావు బహదూర్‌’.. టీజర్‌ రిలీజ్‌

    వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో సత్య దేవ్‌ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రావు బహదూర్‌’. ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై  మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ సమర్పిస్తున్నారు. తాజాగా దీని టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ‘నాకు అనుమానం అనే భూతం పట్టిందంటూ..’ అంటూ ఆసక్తికరమైన డైలాగుతో ఈ వీడియో ప్రారంభమైంది. సైకలాజికల్‌ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దినట్లు టీజర్‌ ఆధారంగా తెలుస్తోంది.

  • సుహాస్‌ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌

    కొత్త కాన్సెప్ట్‌లతో అలరిస్తుంటారు నటుడు సుహాస్‌. ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘హే భగవాన్‌’. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది . హీరోహీరోయిన్లు ఇద్దరూ వారి కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ ప్రేక్షకులకు నవ్వులు పంచారు. గోపి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా  శివానీ నటిస్తున్నారు.

     

  • ట్రోల్స్‌పై స్పందించిన జాన్వీ కపూర్‌

    ముంబైలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నటి జాన్వీ కపూర్ ఉట్టి కొట్టారు. దీనిపై ట్రోల్స్ రావడంతో జాన్వీ స్పందించారు. ‘‘అక్కడున్నవారు ముందు ‘భారత్‌ మాతాకీ జై’ అని అన్నారు. ఆ తర్వాత నేను అన్నాను. వారి వీడియోను కట్‌ చేసి నా మాటలను మాత్రమే వైరల్‌ చేస్తున్నారు. అయినా దేశాన్ని పొగడడానికి ఒక రోజంటూ ప్రత్యేకంగా ఉండదు’’ అని పేర్కొన్నారు.

  • 15వ రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె.!

    HYD : టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె సోమవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. ఉ.11 గంటలకు యూసఫ్‌గూడలోని ఫెడరేషన్‌ ఆఫీస్‌లో 24 క్రాఫ్ట్స్ నాయకుల భేటీ కానున్నారు. కార్మికుల వేతనాలు, సమస్యలపై వీరు చర్చించనున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు.

  • నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్

    నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కొత్త లుక్‌ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఈ నందమూరి వారసుడు మరింత సన్నగా కనిపించారు. ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తారని చర్చ జరిగినా ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో బాలకృష్ణ స్వయంగా కొడుకు సినిమాకు దర్శకత్వం వహిస్తారని సినీవర్లాల్లో చర్చ జరుగుతోంది.

  • ఈ వారం థియేటర్‌లో సందడి చేసే చిత్రాలివే..

    ఈ వారం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి.

    • ఆగస్టు 22: అనుపమ పరమేశ్వరన్‌ ‘పరదా’
    • ఆగస్టు 22: ఆర్‌.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’
    • ఆగస్టు 22: మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ (రీరిలీజ్)

  • NTR అభిమాని హౌస్ అరెస్ట్!

    AP: Jr.NTR అభిమానులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఎన్టీఆర్ అభిమానులు చేయనున్న ధర్నాను నిలిపివేయాంటూ పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో మదనపల్లి ఎన్టీఆర్ అభిమాని టెంపర్ రాజేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

  • న్యూయార్క్​లో బిగ్గెస్ట్ ‘ఇండియా డే’ పరేడ్

    న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అతిపెద్ద ఇండియా డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు కాంగ్రెస్ సభ్యుడు థానేదార్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, పార్లమెంటు సభ్యుడు సత్నామ్ సింగ్స సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాదికి గ్రాండ్ మార్షల్స్‌గా  రష్మిక , విజయ్ దేవరకొండనుగ్రాండ్ మార్షల్స్‌గా సత్కరించారు. మన దేశం వెలుపల అతిపెద్ద పరేడ్ ఇదే కావడం గమనార్హం.

  • సినిమా అవకాశాల కోసం ఆ డైరెక్టర్ వెంటపడ్డా: నాగార్జున

    సినిమా అవకాశాల కోసం తాను కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం వెంటపడేవాడినని నటుడు నాగార్జున అన్నారు. మణిరత్నం కథలకు తాను సూట్ అవుతానని, అలా తమ కాంబోలో వచ్చిన సినిమానే ‘గీతాంజలి’ అని తెలిపారు. ‘‘నాగేశ్వరరావు కొడుకుగానే తొలి ఆరేడు సినిమాలు చేశా. అవి కొందరికి నచ్చలేదు. ‘మజ్ను’ సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఆఖరి పోరాటం’తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నా’’ అని చెప్పుకొచ్చారు.