Locations: Hyderabad

  • రవీంద్ర భారతి ప్రాంగణంలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం

    HYD : గాన గంధర్వుడు, దివంగత గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం పక్కనే SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధ్యతలను రాష్ట్ర సాంస్కృతిక శాఖకు అప్పగించింది.

  • ‘CA పరీక్షలకు సన్నద్ధమవుతున్నాం’

    HYD: ‘అవిభక్త కవలలుగా జన్మించాం.. ఊహ తెలిసినప్పటి నుంచి కలిసే ఉన్నాం.. డిగ్రీ పూర్తిచేశాం..  ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ కావాలనుకుంటున్నాం’’ అని వీణా-వాణిలు చెప్పారు.

  • బాలాపూర్ గణేష్ హుండీ ఆదాయం ₹23 లక్షలు

    HYD: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీ ద్వారా మొత్తం ₹23,13,760 రూపాయల ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం భక్తులు విశేషసంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి కానుకలు సమర్పించినట్లు పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని వెల్లడించారు.

     

  • సమస్యల పరిష్కారానికి కమిషనర్‌కు వినతి

    మేడ్చల్: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ మండల శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించింది. వర్షాల వల్ల గుంతలమయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఐ కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. మురికి కాల్వలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కొత్త ఇళ్లకు నెంబర్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

  • బస్టాండ్ లో దుర్వాసన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

    మేడ్చల్: బస్టాండ్ ఆవరణలో ఉన్న ఒక వాహనంలోని కుళ్ళిన ఉల్లిగడ్డల వాసనతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల క్రితం గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న వాహనాన్ని అధికారులు ఇక్కడే నిలిపి ఉంచారు. ఆ వాహనాన్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరినా స్పందన లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

  • బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బండ కార్తీకా రెడ్డి

    HYD: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులైన మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రవి ప్రసాద్ గౌడ్ సన్మానించారు. తార్నాకలోని ఆమె నివాసంలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీలో కాషాయ జెండా ఎగురవేయడానికి కృషి చేస్తానని కార్తీక్ రెడ్డి తెలిపారు.

     

  • తూళ్ల వీరేందర్ గౌడ్‌‌కు సన్మానం

    రంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన తూళ్ల వీరేందర్ గౌడ్‌ను చేవెళ్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. పరిగి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆయనకు చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

     

  • రాజీకి వీలున్న కేసుల కోసం లోక్ అదాలత్

    మేడ్చల్: జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేటి నుండి 13వ తేదీ వరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీఐ గోపగాని గురువయ్య తెలిపారు. చిన్నపాటి తగాదాలు, రాజీకి వీలున్న కేసులలో ఇరు పార్టీలు మేడ్చల్ కోర్టుకు వచ్చి లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు.

  • పెన్షన్ల కోసం వికలాంగుల ధర్నా

    మేడ్చల్: అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆందోళనకారులు విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 12న మండల కార్యాలయాల వద్ద కూడా ధర్నా చేస్తామని తెలిపారు.

  • BRS పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమీక్షా

    HYD: ఎర్రగడ్డ డివిజన్ ఇన్‌చార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.