HYD: పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ సరైన నిర్ణయమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలని శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు పార్టీయే ముఖ్యమని, పార్టీని ధిక్కరించేవారికి ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Locations: Hyderabad
-
L.B నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ గణపతి పూజలు
రంగారెడ్డి: ఆర్కే పురం డివిజన్‌లోని వాసవి కాలనీలో జరుగుతున్న 38వ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గణనాథుడి నిమజ్జనం
మేడ్చల్: నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో ఉన్న బంగారు ముత్యాలమ్మ ఆలయం వద్ద 18 అడుగుల గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ గణనాథుడిని వజ్రాలతో అలంకరించారు. 50 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న ఈ విగ్రహాన్ని మొయినాబాద్‌లో తయారు చేయించారు. చవితి రోజున మొదలైన అన్నదానం శనివారం వరకు కొనసాగుతుంది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
-
బాలాపూర్ గణేశుడి సేవలో కలెక్టర్, డీసీపీ సునీత
HYD: బాలాపూర్ గణనాథుడిని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు వారిని శలువాతో సన్మానించి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. బాలాపూర్ గణనాథుడు ఎంతో మహిమ గలవాడని కొనియాడారు.
-
షాబాద్‌లో ఈశ్వరి టిఫిన్ సెంటర్ ప్రారంభం
రంగారెడ్డి: షాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈశ్వరి టిఫిన్ సెంటర్‌ను రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్యతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
25 కేజీల లడ్డూను కైవసం చేసుకున్న లత-శ్రీనివాసులు
మేడ్చల్: బోడుప్పల్, చెంగిచర్లలోని క్రాంతి కాలనీ రోడ్ నెం.1లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాట ఘనంగా జరిగింది. 25 కేజీల లడ్డూను నీలం లత-శ్రీనివాసులు దంపతులు రూ.2,10,000/-కు కైవసం చేసుకున్నారు. వేలంపాటలో విజయం సాధించిన దంపతులను స్థానికులు, భక్తులు అభినందించారు. ఈ వేలంపాటలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
-
‘చేవెళ్ల హాస్పిటల్‌లో అన్న ప్రసాద వితరణ’
రంగారెడ్డి: చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్‌లో వినాయక చవితి సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి చైర్మన్, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వైద్య విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృత్తిలో నైపుణ్యాన్ని సాధించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-
బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభించిన ఎమ్మెల్యే
HYD: కాప్రాలోని మాణిక్ సాయి ఎంక్లెవ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ’ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అకాడమీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
పట్టణ శివార్లకు ఆర్టీసీ బస్సుల కొరత
హైదరాబాద్ శివార్లకు ఆర్టీసీ సిటీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న వందల కాలనీలకు సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో, గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. కోఠి నుంచి లింగంపల్లి మార్గంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల రద్దీ ఎక్కువగా ఉన్నా, సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంపై ఆదోళన వ్యక్తం చేస్తున్నారు.
-
పలుకుబడి ఉన్నవారి పనులకు ప్రాధాన్యత
వికారాబాద్: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 18వ వార్డులో మురుగు కాల్వలు శుభ్రం చేసినా, రెండు ఇళ్ల వద్ద మాత్రం మురుగును అలాగే వదిలేశారు. పలుకుబడి ఉన్నవారి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాల వల్ల దుర్వాసన వస్తున్నా, అధికారులు పర్యవేక్షించడం లేదని ప్రజలు వాపోతున్నారు.