Locations: Hyderabad

  • నంది హిల్స్‌లో అన్నదాన కార్యక్రమం

    రంగారెడ్డి : నంది హిల్స్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీర్‌పేట్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ద్యాసాని తిరుపతి రెడ్డి నిర్వహించారు. మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, మహేశ్వరం కన్వీనర్ దేవేందర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

  • అంత్యక్రియలకు ఎస్కేఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

    వికారాబాద్: మర్పల్లి మండలం, పంచలింగాల్ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గొల్ల సిద్దయ్య అంత్యక్రియల కోసం ఎస్కేఆర్ ట్రస్ట్ రూ. 5 వేల ఆర్థిక సాయం అందించింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు సనగారి కొండల్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మనీలా సురేశ్ కుమార్ యాదవ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి  మొత్తాన్ని అందజేశారు.  కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

  • గణపతి మండపాలను సందర్శించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే

    HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గణపతి నవరాత్రులను పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు మండపాలను సందర్శించారు. బోయిన్‌పల్లి, వెస్ట్ మారేడుపల్లి, కస్తూర్బా గాంధీ కళాశాల, రిసాల బజార్‌తో సహా పలు ప్రాంతాల్లోని గణనాథులకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని గణనాథుడిని ప్రార్థించారు.

  • పెళ్లిలోకి ఎంట్రీ ఇచ్చిన అంబులెన్స్.. వీడియో వైరల్

    HYD: గుడిమల్కాపూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి వేడుకలో స్నేహితులు చేసిన ఓ ప్రాంక్‌ అందరినీ షాక్‌కు గురిచేసింది. అంబులెన్స్‌లో మృతదేహం ఉన్నట్లు నటించి, అందులో పూలమాలలు పెట్టి వధూవరులను ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన సినిమా సన్నివేశాన్ని తలపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌ను ఇలాంటి ఆటలకు ఉపయోగించడంపై  నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

     

     

  • బోడుప్పల్‌లో సీసీ రోడ్డు ప్రారంభం

    మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల 3వ డివిజన్, వెంకట్ సాయి నగర్ కాలనీలో రూ. 25 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డును మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చందర్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ బ్రాహ్మణ్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  • బీఈఎంఎల్‌లో 556 కాంట్రాక్ట్ ఉద్యోగాలు

    HYD: బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 556 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఆపరేటర్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఫైర్ సర్వీస్ పర్సనల్స్, సర్వీస్ పర్సనల్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. పదవ తరగతి, ఐటీఐ, నర్సింగ్ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం తప్పనిసరి. ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ‘కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదలకు ఇళ్లు సాధ్యం’

    మేడ్చల్: గణపురం గ్రామ పంచాయతీలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం కింద 70 ఇళ్లు మంజూరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ నిర్మాణంలో ఉన్నఇళ్లను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదలకు ఇళ్లు సాధ్యమని, గతప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

     

  • రాబోయే 3 గంటల్లో HYDలో వర్షం!

    హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రాబోయే మూడు గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • ఉపాధి అవకాశాల కోసం ఏటీసీల ఏర్పాటు: మంత్రి

    వికారాబాద్: యువత ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దుద్యాల మండలం హకీంపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటుచేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • ‘నిమజ్జనానికి కరెంట్ కట్ కాకుండా చర్యలు’

    HYD: ఖైరతాబాద్ గణేష్‌తో పాటు ఇతర ప్రాంతాల వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీజీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ ఫరూఖ్ తెలిపారు. దీనికోసం 68 కంట్రోల్ రూమ్‌లు, 104అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్‌తీగల మరమ్మతులు, ఎర్తింగ్ పనులు పూర్తి చేశామని, ఫ్యూజ్ బాక్సుల వద్ద ప్లాస్టిక్ షీట్లు, పీవీసీ పైపులు అమర్చామని వివరించారు.