Locations: Hyderabad

  • బాలాపూర్‌ గణేశ్‌ను దర్శించుకున్న ఉన్నతాధికారులు

    HYD: బాలాపూర్‌లో కొలువైన వినాయకుడిని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌ రెడ్డి శాలువాలతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అధికారులు నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని పరిశీలించారు.

  • గణేష్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు

    వికారాబాద్‌: ఎన్నెపల్లి, గాంధీ కాలనీ, వాసవి కాలనీ, బీటీఎస్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో వికారాబాద్  బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఆయన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

  • HYDలో ఇంటి అద్దె తక్కువగా ఉన్న ప్రాంతాలు ఇవే..!

    హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందడంతో ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అద్దెలు అధికంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్, బేగంపేట్, సోమాజిగూడ, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో ఒక బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ. 4000 నుంచి రూ. 17000వరకు ఉంది. మధ్యతరగతి, బ్యాచిలర్స్‌కు ఈప్రాంతాలు అనువైనదిగా ఉంటాయి.

  • నేరేడ్‌మెట్‌లో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

    HYD: నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీగుల బాలకృష్ణ (47) అనేవ్యక్తి విద్యుత్ షాక్‌తో మరణించాడు. గణేష్ పండుగ సందర్భంగా రవి తేజ అనే కాంట్రాక్టర్ వద్ద తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. డిఫెన్స్ కాలనీలోని వాటర్ ట్యాంక్ దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పనిచేస్తుండగా, నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలి  ప్రమాదం జరిగింది. మృతుడి కొడుకు ప్రణయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ఎల్‌బీ నగర్ గణేష్ మండపంలో ఎమ్మెల్యే పూజలు

    HYD: ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎల్‌బీ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, నరేంద్ర గౌడ్, మక్కల నర్సింగ్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • అభివృద్ధి పనుల పరిశీలన

    మేడ్చల్: నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్‌లో కార్పొరేటర్ ఖాసిం, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అభివృద్ధి పనులను పరిశీలించారు. తాజ్‌నగర్, అంజుమన్ ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్డు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునరుద్ధరణ, సఫ్దారియా పార్క్ అభివృద్ధి పనులను వారు పర్యవేక్షించారు. తాజ్‌నగర్ నివాసులు రోడ్డు పనులను విస్తరించాలని కోరగా..  జోనల్ కమిషనర్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

  • మందులు తీసుకురావడానికి వెళ్లి యువతి అదృశ్యం

    HYD: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనీషా (21) అనే యువతి అదృశ్యమైంది. మందులు తీసుకురావడానికి వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని  తల్లి నర్సమ్మ ఫిర్యాదు చేసింది. మనీషా ఎత్తు 5.6 అడుగులు. ఆమెకు కుడిచేతిపై ‘అమ్మ’ అని ఆంగ్లంలో పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ రామచందర్ తెలిపారు

     

  • మహిళా డిగ్రీ కళాశాలలో ‘వికసిత భారత్’

    HYD: సికింద్రాబాద్‌లోని బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘వికసిత భారత్ 2047 – యువత పాత్ర’పై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా ప్రొ. ఈ. విద్యాసాగర్, ముఖ్య వక్తగా డా. రవి తేజ హాజరయ్యారు. యువత దేశాభివృద్ధిలో భాగం కావాలని  అన్నారు. క్రమశిక్షణతో లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

     

  • వెంకటేశ్వర కాలనీలో నవరాత్రి ఉత్సవాలు

    మేడ్చల్: కుత్బుల్లాపూర్‌లోని ఈస్ట్ వెంకటేశ్వర కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు  జరుగుతున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ సంబరాలలో, కుటుంబ సభ్యులందరూ కలిసి తొమ్మిది రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ఆటలు ఉంటాయని తెలిపారు. తమ లడ్డు ప్రసాదం వేలంపాటలో తమ కాలనీవారే పోటీ పడటం ప్రత్యేకత అని పేర్కొన్నారు.

  • గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీకి పటిష్ట భద్రత

    HYD: వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని జోనల్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లతో ఆయన సమావేశమయ్యారు. రెండు పండుగలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహిస్తామని సీపీ తెలిపారు.