HYD: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కృష్ణా జిల్లాకు చెందిన తేజ్ కుమార్(30)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్సెంచర్ హెచ్‌ఆర్ అంటూ పరిచయం చేసుకున్న ఇతడు, ఆసిఫ్‌నగర్‌కు చెందిన విద్యార్థి నుంచి రూ.1.70లక్షలు వసూలు చేశాడు. రూ.6.5లక్షల వార్షిక ప్యాకేజీతో నకిలీ ఉద్యోగ ఆఫర్‌ను ఈమెయిల్,వాట్సప్ ద్వారా పంపాడు. తర్వాత స్పందన లేకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Locations: Hyderabad
-
పండుగలు ఎలా జరుపుకోవాలో మాకు తెలుసు: రాజాసింగ్
HYD: గణేశ్ శోభయాత్రలో పెద్ద డీజే సౌండ్‌లు పెడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు తమ పండుగలు ఎలా జరుపుకోవాలో తెలుసని, ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పండుగ ఎలా జరుపుకోవాలో పోలీసులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం డీజే సాంగ్స్ పెడతామని పేర్కొన్నారు.
-
మద్యం సేవిస్తే కఠిన చర్యలు: రాజాసింగ్
HYD: గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లేప్పుడు భక్తులవెవరూ మద్యం సేవించొద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే మద్యం సేవించి.. అసభ్యకర డ్యాన్స్‌లు ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ను తాను అభ్యర్థించానని చెప్పారు. ప్రతి ఒక్క హిందూ గణేశ్ శోభయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
-
నిమజ్జనానికి 6వేల మంది పోలీసులతో బందోబస్తు
HYD: వినాయక నిమజ్జనం కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 వేల మంది పోలీసులతో పాటు వివిధ జిల్లాల నుంచి మరో 700 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని,నిమజ్జన వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
-
లంచం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ
హైదరాబాద్‌లోని జీఎస్టీ, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ లంచం కేసులో అరెస్టయ్యారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి రూ.30,000 లంచం డిమాండ్ చేయగా, చర్చల అనంతరం రూ.25,000 తీసుకోవడానికి అంగీకరించారు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
-
విద్యార్థిని సర్టిఫికెట్స్ కోసం ఆందోళన
మేడ్చల్: నారపల్లిలోని ప్రిన్సిటన్ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు పొందిన తన్విక, 3రోజుల తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో సీటు రావడంతో తన సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని కోరింది. కళాశాల యాజమాన్యం నాలుగు సంవత్సరాల ఫీజుచెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో ఆమె ఆందోళన చెందింది. ఈవిషయంపై బీజేపీ యువమోర్చా నాయకుల మద్దతు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో, తన్విక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలలు
హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ తరహాలో మారనున్నాయి. ఒక్కోపాఠశాలలో 750-1000 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులకు కేటాయించిన నిరుపయోగ స్థలాల్లో పాఠశాలలను నిర్మిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తెలిపారు. దీనివల్ల అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలల అవసరం ఉండదు. నిమ్స్ విస్తరణ కోసం కేటాయించిన పంజాగుట్ట పాఠశాల విద్యార్థులకు ఎర్రమంజిల్‌లో రూ.7 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నారు.
-
గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక బస్సులు
HYD: వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజియన్ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ తెలిపారు.. హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జన వేడుకలను వీక్షించడానికి వచ్చే ప్రజల కోసం ఈ ఏర్పాట్లు చేశారు. కాచిగూడ, బర్కత్‌పుర, ముషీరాబాద్, ఫలక్‌నుమా, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, మిథాని డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపుతారు.
-
మరోసారి భూముల వేలానికి సిద్ధమైన రేవంత్ సర్కార్
TG: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాలను సర్కార్ వేలం వేయనుంది. ఎకరా రూ.101 కోట్లకు విక్రయించనున్నట్లు తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (TGIIC) ప్రకటించింది. ఇదే ధరకు అమ్ముడుపోతే.. దాదాపుగా రూ.1900 కోట్లు ప్రభుత్వంకు రానున్నాయి.
-
ఎత్తైన భవనాల నిర్మాణంలో HYDకు రెండో స్థానం
HYD: దేశంలో ఎత్తైన భవనాల నిర్మాణంలో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. కోకాపేటలో నిర్మించిన 57 అంతస్తుల భవనం దక్షిణాదిలోనే టాప్. ఇక్కడ అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) ఉండటం, నగర విస్తరణకు అవకాశం ఉండటమే ఈ నిర్మాణాలకు ప్రధాన కారణం. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో 40-55 అంతస్తుల భవనాలు, నగరవ్యాప్తంగా 25-40 అంతస్తుల భవనాలు డజనుకు పైగా నిర్మాణంలో ఉన్నాయి.