హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో కబ్జాలపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ 1070 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, చెట్లు కూలిపోవడం, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో హైడ్రా సేవల కోసం ఈ నంబర్‌కు సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు మరోమూడు నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Locations: Hyderabad
-
రైలు కింద పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద భూక్యా పెంటనాయక్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ వాసి అయిన పెంటనాయక్, చర్లపల్లిలోని తన సోదరి వద్ద ఉంటూ ఐటీ కారిడార్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
-
ఈ పక్షిని చూసే విమానం కనిపెట్టారేమో!
HYD: ఒక చిన్న పక్షి ల్యాండింగ్ అయ్యే విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పక్షి తన గమ్యస్థానానికి చేరే సమయంలో చూపిన నైపుణ్యం ఏరోడైనమిక్స్‌కు పాఠాలు చెబుతోంది. విమానం ల్యాండింగ్‌ను ఈ పక్షిని చూసే కనిపెట్టారేమోననిపిస్తోంది కదూ.. ఈ ఆలోచింపజేసే వీడియో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
-
ప్రపంచ పర్యావరణ సంస్థకు జాతీయస్థాయి నంది అవార్డు
HYD: ప్రపంచ పర్యావరణ సంస్థ (WEO)కి ఐబీఎం జాతీయస్థాయిలో ఉత్తమ సేవా రత్న, మహానంది సేవా పురస్కారం ప్రకటించింది. గత 14 ఏళ్లుగా మొక్కలు నాటడం, పాఠశాలల్లో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించడం, పండుగల్లో మొక్కలు పంపిణీ చేయడం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేస్తున్నందుకు గానూ ఈ అవార్డును అందించారు. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ భద్ర మంగళవారం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
-
రేవంత్‌పై షర్మిల ప్రశంసలు
TG:దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. అధికారంలో ఉండి మరొకరిని పొగడటం కష్టమని, కానీ రేవంత్ రెడ్డి తన తండ్రి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారని అన్నారు. అందరూ అనుకున్నట్లు రేవంత్‌కు సహనం తక్కువ కాదని, చాలా ఎక్కువని ఆమె వ్యాఖ్యానించారు.
-
ఎస్ఆర్ నగర్‌లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్
HYD: వినాయక నిమజ్జనం సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, తమ పరిధిలో 260 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారని, వాటిలో 62 విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనం కోసం 107 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
-
‘వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం’
HYD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఓయూ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
-
ఉన్నత చదువుల కోసం వెళ్లి.. అనంత లోకాలకు
మేడ్చల్ : ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన మేడిపల్లికి చెందిన రిషితేజ్ (21) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమృత కాలనీలో నివసించే రాపోలు రవీందర్‌రావు, కిరణ్మయి దంపతుల కుమారుడు అయిన రిషితేజ్ మే 19న ఎంబీఏ చదువుల కోసం లండన్ వెళ్లాడు. ఈస్ట్ లండన్‌లో జరిగిన ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
-
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం: ఒకరు అరెస్ట్
HYD: ఆక్సెంచర్ హెచ్‌ఆర్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కృష్ణా జిల్లాకు చెందిన పొన్నగంటి తేజ్ కుమార్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు అసిఫ్‌నగర్‌కు చెందిన విద్యార్థిని నకిలీ ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా మోసం చేసి రూ. 1.70 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
-
మంచినీటి పైప్‌లైన్‌పై వినతిపత్రం
రంగారెడ్డి: ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి, జలమండలి ఎండీ కే.అశోక్ కుమార్ రెడ్డిని కలిశారు. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో కొత్త మంచినీటి పైప్‌లైన్లను ఏర్పాటు చేయాలని ఆయన వినతిపత్రం ఇచ్చారు. ఆగిపోయిన ట్రంక్ లైన్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎండీని కోరారు. స్వాతిఏజెన్సీ కాలనీ అధ్యక్షులు సీమ సోమనాథ్ కూడా ఉన్నారు.