TG: విమాన ఇంధన కల్తీపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ బీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన ఇంధనాన్ని కూడా కల్తీ చేస్తున్నారని చెప్పారు. గాలిలో ఉండగా.. కల్తీ ఇంధనం వల్ల సమస్య తలెత్తితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలుస్తాయని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ గురునాథం కంపెనీ ట్యాంకర్లలో విమానం ఇంధనం కల్తీ జరిగిందని ఐవోసీఎల్ చర్యలు తీసుకుంది.
Locations: Hyderabad
-
హిమాయత్‌సాగర్‌లో దూకి యువకుడి ఆత్మహత్య
రంగారెడ్డి: హిమాయత్‌సాగర్ జలాశయంలో ఆరిఫ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పరపల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్, రాపిడో బైక్ బుక్ చేసుకొని జలాశయం వద్దకు వచ్చాడు. అందరూ చూస్తుండగానే నీటిలోకి దూకి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
డ్యామేజ్ కంట్రోల్: కవిత సస్పెన్షన్ వెనుక వ్యూహం!
TG: బీఆర్ఎస్ అధిష్టానం కవితపై సస్పెన్షన్ వేటు వేయడం ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్‌తో పాటు, తాజాగా సీనియర్ నేతలపై ఆమె చేసిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ క్రమంలో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆమెను సస్పెండ్ చేసి, వివాదాల నుంచి పార్టీ ఇమేజ్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
జూబ్లీహిల్స్‌లో ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే?
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ సమ్మరీని విడుదల చేసింది. నియోజకవర్గంలో మూడు లక్షల 92,669 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో పురుషలు ఓటర్లు రెండు లక్షలు, మహిళ ఓటర్లు లక్షా 88 వేలకు పైచిలుకు ఉన్నారు. నియోజకవర్గంలో 47 పోలింగ్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. 17వ తేదీ వరకు ఫిర్యాదులు అభ్యంతరాలను తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ నోట్ విడుదల చేసింది.
-
ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు
HYD: గణేష్ నవరాత్రి ఉత్సవాల శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మహంకాళి ఏసీపీ సైదయ్య, ఇన్‌స్పెక్టర్ పరశురాం ఆధ్వర్యంలో జరిగిన మార్చ్ క్లాక్ టవర్, పలికా బజార్, సుభాష్ రోడ్, జనరల్ బజార్, నల్లగుట్ట వంటి ప్రాంతాల్లో సాగింది. మార్చ్‌లో పలువురు ఇన్‌స్పెక్టర్లు, డీఐలు, సెక్టార్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
-
సుభాష్ పాలేకర్‌కు వైఎస్‌ఆర్ మెమోరియల్ అవార్డు
TG: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డులను ప్రదానం చేశారు. సేంద్రీయ వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న పద్మశ్రీ డాక్టర్ సుభాష్ పాలేకర్, డాక్టర్ సి. సుధ, డాక్టర్ నాగేశ్వరరావులకు ఈ పురస్కారాలను అందజేశారు. రైతుల సంక్షేమానికి వైఎస్ఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
-
SBI సేవలు సద్వినియోగం చేసుకోండి: అదనపు కలెక్టర్
వికారాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. నవాబ్‌పేటలోని అర్కతల గ్రామంలో SBI నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. తక్కువ ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, సురక్ష బీమా యోజన వంటి పథకాల ద్వారా రూ. 2 లక్షల వరకు బీమాసౌకర్యం పొందవచ్చని తెలిపారు.
-
గణేష్ పూజలో కుటుంబంతో రామేశ్వర్ గౌడ్
HYD: సితాఫలమండీలోని టీ.ఆర్.టీ. యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బీఆర్‌ఎస్ యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ తన కుటుంబంతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సితాఫలమండీ, బౌద్ధనగర్ ప్రాంతాల్లోని వివిధ మండపాలను కూడా ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు.
-
మేడ్చల్‌లో సామూహిక కుంకుమార్చన
మేడ్చల్: రాఘవేంద్రనగర్ కాలనీలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్చకులు మాధవ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు.
-
చిలకలగూడలో.. లష్కర్ అధ్యక్షుడు
HYD: టీమ్ 9 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేషుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, లష్కర్ జిల్లా ఆకాంక్ష త్వరగా నెరవేరాలని ఆయన వేడుకున్నారు.