వికారాబాద్: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు శాంతియుతంగా ఉత్సవాలను పూర్తి చేయడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా నిమజ్జనం సమయంలో లోతైన నీటిలోకి వెళ్ళవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వేడుకలు పోలీసు సిబ్బందిలో ఐక్యతను పెంచుతాయని ఎస్పీ అన్నారు.
Locations: Hyderabad
-
ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 275 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్..
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఐటీ కారిడార్‌లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా..త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గుడ్‌న్యూస్ చెప్పారు. ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
-
శ్రీశ్రీ హాస్పిటల్స్‌లో 860 గ్రాముల పసిబిడ్డకు పునర్జన్మ
HYD: కొండాపూర్‌లోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వైద్యులు కేవలం 860 గ్రాముల బరువుతో జన్మించిన పసిబిడ్డకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 28 వారాలకే పుట్టిన ఆ శిశువు, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలతో బాధపడింది. నిపుణులైన వైద్యులు, అధునాతన వెంటిలేటర్లు, ప్రత్యేకమైన చికిత్సల సహాయంతో ఆ చిన్నారిని 50 రోజులపాటు పర్యవేక్షించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయానికి బిడ్డ బరువు 1.57 కిలోలకు పెరిగి ఆరోగ్యంగా ఉంది.
-
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాలలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అలాగే, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు చోట్ల కూడా వర్షం నమోదైంది. ఈ వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
-
IBPS క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? అయితే మీకిదే చివరి ఛాన్స్..
IBPS క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంస్థ అవకాశం కల్పించింది. దరఖాస్తులో ఏవైనా తప్పులుఉంటే, వాటిని సవరించుకోవడానికి సెప్టెంబర్ 2 నుంచి 3 వరకు అవకాశం ఇచ్చింది. 10,277 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తుల సవరణ తర్వాత, ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నారు. ఈపరీక్షలు అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరుగుతాయి, మెయిన్స్ నవంబర్ 29న ఉంటుంది.
-
KCRకు కన్నబిడ్డ కంటే వారే ముఖ్యం: MLA కేపీ
హైదరాబాద్: కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తే ఎవరినీ ఉపేక్షించకూడదనే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తప్పుచేస్తే తన కుటుంబ సభ్యులనైనా సహించనని కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదనే విషయం ఈనిర్ణయంతో స్పష్టమైందని, కన్నబిడ్డ కంటే పార్టీకి అండగా ఉన్నవారే ముఖ్యమని కేసీఆర్ చాటారని వివేకానంద పేర్కొన్నారు.
-
బాలానగర్ ఫ్లైఓవర్ వద్ద చెట్ల కొమ్మల తొలగింపు
HYD: బాలానగర్ ఫ్లైఓవర్‌పై సురక్షితమైన రాకపోకల కోసం ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ వైపు ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పనుల కారణంగా వాహనదారులు కొంతసేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ పక్రియను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా, పనులు పూర్తయ్యేంత వరకు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-
భగ్గుమన్న జాగృతి.. బీఆర్ఎస్ నేతల దిష్టిబొమ్మల దహనం
TG: బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి శ్రేణులు ఆందోళనకు దిగాయి. కవిత సస్పెన్షన్‌కు హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డిలే కారణమని ఆరోపిస్తూ జాగృతి కార్యకర్తలు వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కవితను అన్యాయంగా పార్టీ నుంచి బహిష్కరించారని, ఆమెకు అండగా ఉంటామని నినాదాలు చేశారు.
-
“వాడెవ్వడు వీడెవ్వడు కవిత అక్కకు అడ్డు ఎవడు”
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు హైదరాబాద్‌లోని వారి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. “వాడెవ్వడు వీడెవ్వడు కవిత అక్కకు అడ్డు ఎవడు” అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కొందరి ఆనందం కోసమే కవితను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే చర్యలను సహించబోమని, సస్పెన్షన్ నిర్ణయం చెల్లుబాటు కాదని వారు పేర్కొన్నారు.
-
వైఎస్సార్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళులు
HYD: వైఎస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళులు అర్పించారు. పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కృషి చేశారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. రైతుల రుణాలను మాఫీ చేసి రైతన్నల ఆత్మహత్యలను నివారించారని, హైదరాబాద్ అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర మరువలేనిదని శ్రీగణేష్ కొనియాడారు.