HYD: IPO అలాట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న బొబ్బారి శ్రీనివాసరావు(34)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై దేశవ్యాప్తంగా 19కేసులు నమోదయ్యాయి. యాక్సిస్ సెక్యూరిటీ పేరుతో 63ఏళ్ల బాధితుడిని నమ్మించి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ కోటాలో షేర్లు కేటాయించినట్లు నమ్మబలికి రూ.43లక్షలు మోసం చేశాడు. నిందితుడి వద్ద నుంచి 2ఫోన్లు, సిమ్‌కార్డులు, పాస్‌బుక్‌లు, డెబిట్‌కార్డులు, చెక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో వర్షం మళ్లీ షురూ కావడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. నగరానికి భారీ వర్ష సూచన ఉండటంతో సిటీ ప్రజలకు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కీలక సూచన చేశారు. అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.