హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జేఎన్టీయూ, కుకట్‌పల్లి, మియాపూర్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం, వినాయక నిమజ్జనాల కారణంగా ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు నెలకొన్నాయి.
Locations: Hyderabad
-
‘JNTUలో రంగోలి పోటీలు’
HYD: జేఎన్‌టీయూలో గౌరీనందనుడి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 టీమ్‌లు పాల్గొన్నాయి. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా రూ.1016, రెండో బహుమతిగా రూ.716, మూడో బహుమతిగా రూ.516, నాలుగో బహుమతిగా రూ.316 ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ అరుణ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
-
వినాయక విగ్రహాలకు బండి రమేష్ ప్రత్యేక పూజలు
HYD: టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ కూకట్‌పల్లిలోని గణేష్ మండపాలను సందర్శించారు. ప్రశాంత్ నగర్, ఖైతలాపూర్‌లలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ పండుగలో ప్రజలందరూ కలిసిమెలసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
-
కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలు..
వికారాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్రమీడియా ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. తాండూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ధర్నా నిర్వహించింది. హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని శ్రీశైల్ రెడ్డి విమర్శించారు. పీసీఘోష్ నివేదిక బూటకమని, సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో పాలన చేస్తున్నారని ఆరోపించారు.
-
సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన
HYD: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిరసనగా సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీతాఫల్‌మండి వద్ద బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.
-
HYDలో ఆకట్టుకున్న అందాల షో..
HYD: సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో ‘మిస్, మిసెస్ బెలెజా తెలంగాణ గ్రాండ్ ఫినాలే సీజన్-2’ ఘనంగా జరిగింది. ఈపోటీలో డాక్టర్లు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, గృహిణులతో సహా 20 మంది ఫైనలిస్టులు పాల్గొన్నారు. ‘మిస్’ కేటగిరీ విజేతగా డి.కావ్యాంజలి, ఫస్ట్ రన్నరప్‌గా కందకట్ల ప్రత్యూష నిలిచారు. ‘మిసెస్’ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్‌గా డా. పి.నిఖిలా రెడ్డి ఎంపికయ్యారు.
-
రైళ్లపై రాళ్లదాడి.. 33 మంది అరెస్టు
HYD: దక్షిణమధ్య రైల్వే పరిధిలో రైళ్లపై రాళ్లదాడికి పాల్పడిన 33 మందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అరెస్టు చేసింది. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 54 రాళ్ల దాడులు, 8 ట్రాక్ ఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు. రైళ్లపై రాళ్లు వేసినా, ట్రాక్‌లపై వస్తువులు ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ఆస్తుల రక్షణ కోసం ప్రజలు సమాచారం ఇవ్వాలని రైల్వే అధికారులు కోరారు.
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
మేడ్చల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ నాగారం, రాంపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఈ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.
-
HYDలో వర్షం.. వాహనదారుల ఇక్కట్లు
తెలంగాణలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షంతో ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
-
కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అవినీతి బట్టబయలు: బీజేపీ
TG: బీఆర్ఎస్ అవినీతిపై తాము చేసిన ఆరోపణలకు, కవిత వ్యాఖ్యలే నిదర్శనమని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్ర రావు పేర్కొన్నారు. అవినీతి సొమ్ము పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే వారి కుటుంబ సభ్యురాలే నిజాలు బయటపెట్టారని తెలిపారు. కవిత సస్పెన్షన్ వారి అంతర్గత వ్యవహారమని, కానీ దానివల్ల వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.