HYD: నాగారం మున్సిపల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ జలమండలి ఏఈ సాయికిరణ్ గౌడ్‌తో కలిసి నాగారంలోని వీఎస్టీ, సాయిబాబా కాలనీలలో వాటర్ పైప్‌లైన్, కనెక్షన్లపై సర్వేచేశారు. ఏఈ సాయికిరణ్ గౌడ్ వాటర్ కనెక్షన్లపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. రాజ్ సుఖ్ నగర్ ప్రెసిడెంట్ దాస్, వీఎస్టీ కాలనీ ప్రెసిడెంట్ మనోహర్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
లంగర్ హౌస్‌లో గంజాయి విక్రేతలు అరెస్ట్
HYD: గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీం అరెస్ట్ చేసింది. లంగర్ హౌస్ తాడి షాపు సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారి అంజిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి మహమ్మద్ జావేద్, మహమ్మద్ ముషారఫ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, బైక్, 2సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
-
కవిత NEXT స్టెప్.. ఏంటీ?
TG: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఆమె బీజేపీ పార్టీలో చేరతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, ప్రస్తుతానికి మౌనంగా ఉంటూ కొత్త పార్టీ ఏర్పాటుపై దృష్టి పెట్టడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె వేయబోయే తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
-
సీఎంకు.. ఖైదీల కుటుంబ సభ్యులు విజ్ఞప్తి!
HYD: జైళ్లలో చాలా కాలంగా శిక్ష అనుభవిస్తున్న తమవాళ్లను క్షమాభిక్షతో విడుదల చేయాలని జీవిత ఖైదీల ఫ్యామిలీ మెంబర్స్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సమాజానికి మంచి జరిగేలా, వీళ్లకు రెండో ఛాన్స్ ఇవ్వాలని వాళ్లు రిక్వెస్ట్ చేశారు. ఖైదీల పరిస్థితిని అర్థం చేసుకుని రిలీజ్ చేస్తే వాళ్లు కొత్త జీవితం స్టార్ట్ చేస్తారని, ఇది వాళ్లకు, సమాజానికి మేలు చేస్తుందని కోరారు.
-
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..
HYD: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 35, బెండకాయ 40, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి 40, కాకరకాయ 27, బీరకాయ 38, క్యాబేజీ 15, బీన్స్ 40, క్యారెట్ 43, గోబిపువ్వు 25, దొండకాయ 40, చిక్కుడు కాయ 55, గోరుచిక్కుడు 28, బీట్‌రూట్ 25, క్యాప్సికం 50, ఆలుగడ్డ 23, కీర 18, దోసకాయ 23, సొరకాయ 20, పొట్లకాయ 45 లకు విక్రయిస్తున్నారు.
-
‘కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం’
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సూరారం, గండి మైసమ్మ, ప్రగతి నగర్, బాచుపల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో ఈ వర్షం పడింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించినా, కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
-
ఘనంగా గణేశ్ చతుర్థి వేడుకలు
HYD: పద్మారావు నగర్‌లో అమూల్య వండర్ అవెన్యూ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ గణపతి వేడుకల్లో భాగంగా మండపం వద్ద హోమం, మహాహారతి, లలితాదేవి పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక కాలనీవాసులతో పాటు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్‌లో నిషేధిత గేమింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ సౌత్‌జోన్, ఎస్.ఆర్.నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈదాడిలో 8మందిని అరెస్ట్ చేయగా..మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి వద్ద నుంచి 18 మొబైల్స్, 3పాస్‌బుక్‌లు, 13 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, రూ. 29,81,000 ఆన్‌లైన్ లావాదేవీలను నిలిపివేశారు. ఈ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
నగరం నడిబొడ్డున రూ.400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
HYD:బంజారాహిల్స్ రోడ్ నెంబర్10లోని జలమండలి రిజర్వాయర్ పక్కన 5ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించారు. రాత్రికిరాత్రే ప్రభుత్వ బోర్డులు తొలగించి, రౌడీలను మోహరించారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈస్థలం విలువ సుమారు రూ.400కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు. ఆక్రమణకు యత్నించిన పార్థసారథి, విజయ్, భార్గవ్‌లపై ఇప్పటికే 3కేసులు నమోదయ్యాయి.
-
బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ‘మై ఫ్రెండ్ గణేశ డ్రాయింగ్ పోటీ’
HYD: రాష్ట్రీయ బజరంగ్ దళ్ కిడ్జ్ అహెడ్ విభాగం ఆధ్వర్యంలో శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్‌లో మై ఫ్రెండ్ గణేశ డ్రాయింగ్ పోటీ విజయవంతంగా నిర్వహించబడింది. పోటీలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు 51 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి బండారు శ్రద్ధానంద్ ఆర్య, తొటఉదయ్ కుమార్, కళారు మనదీప్, శ్రీకాంత్, పావన్, మురళి, ప్రశాంత్, ప్రవీణ్ ప్రమోద్ పాల్గొన్నారు.
‘