Locations: Hyderabad

  • బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ‘మై ఫ్రెండ్ గణేశ డ్రాయింగ్ పోటీ’

    HYD: రాష్ట్రీయ బజరంగ్ దళ్ కిడ్జ్ అహెడ్ విభాగం ఆధ్వర్యంలో శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్‌లో మై ఫ్రెండ్ గణేశ డ్రాయింగ్ పోటీ విజయవంతంగా నిర్వహించబడింది.  పోటీలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు  51 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  రాష్ట్ర కార్యదర్శి బండారు శ్రద్ధానంద్ ఆర్య, తొటఉదయ్ కుమార్, కళారు మనదీప్, శ్రీకాంత్, పావన్, మురళి, ప్రశాంత్, ప్రవీణ్ ప్రమోద్ పాల్గొన్నారు.

  • బీజీ లైఫ్.. ప్లే స్కూల్స్‌కు పెరుగుతున్న డిమాండ్

    హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్లే స్కూల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకు ఇది సౌకర్యంగా ఉండటం వల్ల హైటెక్ సిటీ, మియాపూర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాలలో ఈ పోకడ అధికంగా ఉంది. ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లలను చూసుకోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొవడంతో ఈ ప్లే స్కూల్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. పనిచేసే తల్లిదండ్రులకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి.

  • హైదరాబాద్‌లో మసీదులకు మాస్కులు.. కారణమిదే!

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలోని మసీదులను కవర్లతో కప్పివేశారు. అఫ్జల్‌గంజ్, చార్మినార్ ప్రాంతాల్లో ఈచర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకనిఘా ఏర్పాటుచేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

  • పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి

    HYD: నాంపల్లి నియోజకవర్గంలోని బజార్ ఘాట్‌లో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మైనారిటీ విద్యాసంస్థల భవనాల పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులకోసం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

  • కార్మికుడు అనుమానాస్పద మృతి.. రహస్యంగా దహన సంస్కారాలు

    మేడ్చల్: రహస్యంగా మృతదేహానికి దహన సంస్కారాలు చేయాలన్న కుట్రను దుండిగల్ పోలీసులు భగ్నం చేశారు. గాగిల్లాపూర్‌లోని ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ విల్లాలో నిర్మాణ కార్మికుడు బాపన్‌దాస్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. నిర్మాణసంస్థ మృతదేహాన్ని రహస్యంగా కాల్చేందుకు ప్రయత్నించగా..ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీఆసుపత్రికి తరలించారు.

  • గణేశ్ నిమజ్జనం.. ఈ జాగ్రత్తలు పాటించండి

    HYD: గణపతి నిమజ్జనం సందర్భంగా రాచకొండ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాహనాలను వెనక్కి తిప్పవద్దని సూచించారు. డ్రైవర్ మద్యం సేవించకూడదని, నిమజ్జన వాహనంవెంట పిల్లలు రాకూడదని తెలిపారు. ప్రతివాహనానికి ఇన్‌ఛార్జ్‌ను నియమించుకోవాలని, పెద్దవిగ్రహాల నిమజ్జనానికి ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సూచనలు పాటించడం ద్వారా అవాంఛనీయ ఘటనలను నివారించవచ్చని తెలిపారు.

     

  • కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తుంది..

    వికారాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. కేసీఆర్ పేరు నిలిచిపోతుందన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ వద్ద పిల్లర్లను కావాలనే కుంగగొట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని ఆనంద్ విమర్శించారు.

     

  • బడా గణేశ్‌కు Sr.NTR పూజలు.. SMలో ఫోటో వైరల్!

    HYD: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేశుడిని 1954లో స్వాతంత్య్ర సమరయోధుడు సింగరి శంకరయ్య మొదటిసారిగా ప్రతిష్టించారు. మొదట్లో కేవలం అడుగు ఎత్తు ఉన్న ఈవిగ్రహం కాలక్రమేణా భారీగా పెరిగింది. ఈ బడా గణేశ్‌ను అనేకమంది ప్రముఖులు దర్శించుకుంటూ ఉంటారు. ఈక్రమంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకసారి ఖైరతాబాద్ గణేశుడికి పూజలు చేసిన పాతఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • ‘రోడ్డుపై బైఠాయించి మహిళ నిరసన’

    HYD: సీబీఐకి కేసు అప్పగించడాన్ని నిరసిస్తూ, సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకురాలు ఎర్ర జ్యోతి కారును పోలీసులు అడ్డుకోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె నిరసన విరమించారు. ఈ ఘటనతో సీతాఫలమండి కూడలి వద్ద గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మహా ధర్నా

    తెలంగాణ మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య వారికి మద్దతు తెలిపారు. 6నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ‘సమాన పనికి సమాన వేతనం’ అమలుచేసి, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని కోరారు. ఏజెన్సీలను తొలగించి, ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.