HYD: దక్షిణమధ్య రైల్వే పరిధిలో రైళ్లపై రాళ్లదాడికి పాల్పడిన 33 మందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అరెస్టు చేసింది. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 54 రాళ్ల దాడులు, 8 ట్రాక్ ఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు. రైళ్లపై రాళ్లు వేసినా, ట్రాక్‌లపై వస్తువులు ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ఆస్తుల రక్షణ కోసం ప్రజలు సమాచారం ఇవ్వాలని రైల్వే అధికారులు కోరారు.
Locations: Hyderabad
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
మేడ్చల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ నాగారం, రాంపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఈ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.
-
HYDలో వర్షం.. వాహనదారుల ఇక్కట్లు
తెలంగాణలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షంతో ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
-
కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అవినీతి బట్టబయలు: బీజేపీ
TG: బీఆర్ఎస్ అవినీతిపై తాము చేసిన ఆరోపణలకు, కవిత వ్యాఖ్యలే నిదర్శనమని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్ర రావు పేర్కొన్నారు. అవినీతి సొమ్ము పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే వారి కుటుంబ సభ్యురాలే నిజాలు బయటపెట్టారని తెలిపారు. కవిత సస్పెన్షన్ వారి అంతర్గత వ్యవహారమని, కానీ దానివల్ల వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
-
వాటర్ కనెక్షన్లపై కాలనీ వాసులకు అవగాహన
HYD: నాగారం మున్సిపల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ జలమండలి ఏఈ సాయికిరణ్ గౌడ్‌తో కలిసి నాగారంలోని వీఎస్టీ, సాయిబాబా కాలనీలలో వాటర్ పైప్‌లైన్, కనెక్షన్లపై సర్వేచేశారు. ఏఈ సాయికిరణ్ గౌడ్ వాటర్ కనెక్షన్లపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. రాజ్ సుఖ్ నగర్ ప్రెసిడెంట్ దాస్, వీఎస్టీ కాలనీ ప్రెసిడెంట్ మనోహర్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
-
లంగర్ హౌస్‌లో గంజాయి విక్రేతలు అరెస్ట్
HYD: గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీం అరెస్ట్ చేసింది. లంగర్ హౌస్ తాడి షాపు సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారి అంజిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి మహమ్మద్ జావేద్, మహమ్మద్ ముషారఫ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, బైక్, 2సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
-
కవిత NEXT స్టెప్.. ఏంటీ?
TG: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఆమె బీజేపీ పార్టీలో చేరతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, ప్రస్తుతానికి మౌనంగా ఉంటూ కొత్త పార్టీ ఏర్పాటుపై దృష్టి పెట్టడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె వేయబోయే తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
-
సీఎంకు.. ఖైదీల కుటుంబ సభ్యులు విజ్ఞప్తి!
HYD: జైళ్లలో చాలా కాలంగా శిక్ష అనుభవిస్తున్న తమవాళ్లను క్షమాభిక్షతో విడుదల చేయాలని జీవిత ఖైదీల ఫ్యామిలీ మెంబర్స్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సమాజానికి మంచి జరిగేలా, వీళ్లకు రెండో ఛాన్స్ ఇవ్వాలని వాళ్లు రిక్వెస్ట్ చేశారు. ఖైదీల పరిస్థితిని అర్థం చేసుకుని రిలీజ్ చేస్తే వాళ్లు కొత్త జీవితం స్టార్ట్ చేస్తారని, ఇది వాళ్లకు, సమాజానికి మేలు చేస్తుందని కోరారు.
-
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..
HYD: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 35, బెండకాయ 40, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి 40, కాకరకాయ 27, బీరకాయ 38, క్యాబేజీ 15, బీన్స్ 40, క్యారెట్ 43, గోబిపువ్వు 25, దొండకాయ 40, చిక్కుడు కాయ 55, గోరుచిక్కుడు 28, బీట్‌రూట్ 25, క్యాప్సికం 50, ఆలుగడ్డ 23, కీర 18, దోసకాయ 23, సొరకాయ 20, పొట్లకాయ 45 లకు విక్రయిస్తున్నారు.
-
‘కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం’
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సూరారం, గండి మైసమ్మ, ప్రగతి నగర్, బాచుపల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో ఈ వర్షం పడింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించినా, కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.