HYD: పద్మారావు నగర్‌లో అమూల్య వండర్ అవెన్యూ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ గణపతి వేడుకల్లో భాగంగా మండపం వద్ద హోమం, మహాహారతి, లలితాదేవి పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక కాలనీవాసులతో పాటు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.