Locations: Hyderabad

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

    HYD: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 35, బెండకాయ 40, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి 40, కాకరకాయ 27, బీరకాయ 38, క్యాబేజీ 15, బీన్స్‌ 40, క్యారెట్‌ 43, గోబిపువ్వు 25, దొండకాయ 40, చిక్కుడు కాయ 55, గోరుచిక్కుడు 28, బీట్‌రూట్‌ 25, క్యాప్సికం 50, ఆలుగడ్డ 23, కీర 18, దోసకాయ 23, సొరకాయ 20, పొట్లకాయ 45 లకు విక్రయిస్తున్నారు.

  • ‘కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం’

    HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సూరారం, గండి మైసమ్మ, ప్రగతి నగర్, బాచుపల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో ఈ వర్షం పడింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించినా, కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

  • ఘనంగా గణేశ్ చతుర్థి వేడుకలు

    HYD: పద్మారావు నగర్‌లో అమూల్య వండర్ అవెన్యూ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ గణపతి వేడుకల్లో భాగంగా మండపం వద్ద హోమం, మహాహారతి, లలితాదేవి పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక కాలనీవాసులతో పాటు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

     

  • హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

    హైదరాబాద్‌లో నిషేధిత గేమింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ సౌత్‌జోన్, ఎస్.ఆర్.నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈదాడిలో 8మందిని అరెస్ట్ చేయగా..మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి వద్ద నుంచి 18 మొబైల్స్, 3పాస్‌బుక్‌లు, 13 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, రూ. 29,81,000 ఆన్‌లైన్ లావాదేవీలను నిలిపివేశారు. ఈ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • నగరం నడిబొడ్డున రూ.400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

    HYD:బంజారాహిల్స్ రోడ్ నెంబర్10లోని జలమండలి రిజర్వాయర్ పక్కన 5ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించారు. రాత్రికిరాత్రే ప్రభుత్వ బోర్డులు తొలగించి, రౌడీలను మోహరించారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈస్థలం విలువ సుమారు రూ.400కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు. ఆక్రమణకు యత్నించిన పార్థసారథి, విజయ్, భార్గవ్‌లపై ఇప్పటికే 3కేసులు నమోదయ్యాయి.

  • బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ‘మై ఫ్రెండ్ గణేశ డ్రాయింగ్ పోటీ’

    HYD: రాష్ట్రీయ బజరంగ్ దళ్ కిడ్జ్ అహెడ్ విభాగం ఆధ్వర్యంలో శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్‌లో మై ఫ్రెండ్ గణేశ డ్రాయింగ్ పోటీ విజయవంతంగా నిర్వహించబడింది.  పోటీలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు  51 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  రాష్ట్ర కార్యదర్శి బండారు శ్రద్ధానంద్ ఆర్య, తొటఉదయ్ కుమార్, కళారు మనదీప్, శ్రీకాంత్, పావన్, మురళి, ప్రశాంత్, ప్రవీణ్ ప్రమోద్ పాల్గొన్నారు.

  • బీజీ లైఫ్.. ప్లే స్కూల్స్‌కు పెరుగుతున్న డిమాండ్

    హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్లే స్కూల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకు ఇది సౌకర్యంగా ఉండటం వల్ల హైటెక్ సిటీ, మియాపూర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాలలో ఈ పోకడ అధికంగా ఉంది. ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లలను చూసుకోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొవడంతో ఈ ప్లే స్కూల్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. పనిచేసే తల్లిదండ్రులకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి.

  • హైదరాబాద్‌లో మసీదులకు మాస్కులు.. కారణమిదే!

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలోని మసీదులను కవర్లతో కప్పివేశారు. అఫ్జల్‌గంజ్, చార్మినార్ ప్రాంతాల్లో ఈచర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకనిఘా ఏర్పాటుచేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

  • పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి

    HYD: నాంపల్లి నియోజకవర్గంలోని బజార్ ఘాట్‌లో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మైనారిటీ విద్యాసంస్థల భవనాల పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులకోసం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

  • కార్మికుడు అనుమానాస్పద మృతి.. రహస్యంగా దహన సంస్కారాలు

    మేడ్చల్: రహస్యంగా మృతదేహానికి దహన సంస్కారాలు చేయాలన్న కుట్రను దుండిగల్ పోలీసులు భగ్నం చేశారు. గాగిల్లాపూర్‌లోని ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ విల్లాలో నిర్మాణ కార్మికుడు బాపన్‌దాస్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. నిర్మాణసంస్థ మృతదేహాన్ని రహస్యంగా కాల్చేందుకు ప్రయత్నించగా..ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీఆసుపత్రికి తరలించారు.