HYD: గణపతి నిమజ్జనం సందర్భంగా రాచకొండ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాహనాలను వెనక్కి తిప్పవద్దని సూచించారు. డ్రైవర్ మద్యం సేవించకూడదని, నిమజ్జన వాహనంవెంట పిల్లలు రాకూడదని తెలిపారు. ప్రతివాహనానికి ఇన్ఛార్జ్ను నియమించుకోవాలని, పెద్దవిగ్రహాల నిమజ్జనానికి ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సూచనలు పాటించడం ద్వారా అవాంఛనీయ ఘటనలను నివారించవచ్చని తెలిపారు.