Locations: Hyderabad

  • ఇక నుంచి 3 నెలలకోసారి నల్లా బిల్లు!

    హైదరాబాద్ జలమండలి గృహ సముదాయాలకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై మూడు నెలలకు ఒకసారి నల్లా బిల్లు జారీ చేయనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాను పరిగణనలోకి తీసుకొని, మూడు నెలలకు కలిపి 60 వేల లీటర్ల వరకు రీడింగ్ ఉంటే బిల్లు ZERO BILL వస్తుందని ఆయన పేర్కొన్నారు.

     

     

  • జీవనశైలి మార్చుకోకుంటే.. ముప్పే!

    హైదరాబాద్‌లో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. అయితే, వీటిని నియంత్రించడం మన చేతుల్లోనే ఉందని నిపుణులు అంటున్నారు. రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం, వారానికి ఐదురోజులు క్రమం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. అలాగే, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు ఉండేలా చూసుకోవాలి. 6-7 గంటలు నిద్రపోవడం ద్వారా ఈ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

  • ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద బీఆర్ఎస్ నిరసన

    మేడ్చల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపుమేరకు ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈనిరసనతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

  • గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

    HYD: గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం పక్కన పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి (దాదాపు 60-65) డెడ్ బాడీని పోలీసులు గమనించారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • హైదరాబాద్‌లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం

    హైదరాబాద్‌ నగరంలో రాత్రిపూట శబ్ద కాలుష్యం పెరుగుతోందని,ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. భారీ హారన్‌లు, సైలెన్సర్‌లు, ట్రావెల్ బస్సుల శబ్దాలే దీనికి ప్రధాన కారణాలు. దీంతో వినికిడి లోపం, ఏకాగ్రత దెబ్బతినడం, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఈకాలుష్యాన్ని నియంత్రించేందుకు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రిపూట శబ్దాలు 40 డెసిబుళ్ల కన్నా తక్కువ ఉండాలని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

  • బైకుపై వెళ్తుండగా.. కరెంటు స్తంభం విరిగి పడి వ్యక్తి మృతి

    మేడ్చల్: నాచారం పీఎస్ పరిధిలో కరెంట్ స్తంభం విరిగి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ స్తంభం అకస్మాత్తుగా విరిగి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కార్తికేయనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాత్విక్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • అచ్చం ముత్యం పొదిగినట్టే.. సందర్శకులను ఆకట్టుకుంటూ..

    హైదరాబాద్ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది చార్మినర్.. అలాంటి చార్మినార్‌ అంటేనే ముత్యాలకు ప్రసిద్ధి. నగర సుందరీకరణలో భాగంగా మదీనా కూడలిలో ముత్యం పొదిగినట్టు ఏర్పాటు చేసిన ఈ ఆకృతి సందర్శకులను ఆకట్టుకుంటోంది.

  • HYDలో గణేశ్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ రూ. 54 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు 20 చెరువులు, 74 కృత్రిమ కొలనుల ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. నిమజ్జనంలో 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో నిమజ్జన సందడి కొనసాగుతుండగా.. వ్యర్థాల తరలింపునకు 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను ఉపయోగిస్తున్నారు.

     

     

  • తెలంగాణలో మరో 3రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

    తెలంగాణలో మరో 3రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొత్తగూడెం, జగిత్యాల, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, ములుగు, వరంగల్ వంటి జిల్లాలకు ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వరదల కారణంగా తీవ్రనష్టం జరిగింది. ఇప్పుడు మరోసారి భారీవర్షాలు వస్తుండటంతో, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  • ప్రియుడు కోసం కుటుంబాన్ని కాదన్నదని దారుణం

    HYD: జగద్గిరిగుట్టలో సోషల్ మీడియా కారణంగా ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. 13ఏళ్లక్రితం పెళ్లయిన కల్యాణి(33)కి ఇన్‌స్టాలో కర్నూలుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ప్రేమగామారింది. ప్రియుడి కోసం భర్త శ్రీధర్(34)కు విడాకులు ఇస్తానని చెప్పడంతో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో శ్రీధర్ కోపంతో కత్తితో కల్యాణి గొంతు, ముఖం, చేతులపై దాడిచేసి..అనంతరం తానూ చేతులు కోసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలరు.