Locations: Hyderabad

  • గణేశ్ నిమజ్జనం.. ఈ జాగ్రత్తలు పాటించండి

    HYD: గణపతి నిమజ్జనం సందర్భంగా రాచకొండ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాహనాలను వెనక్కి తిప్పవద్దని సూచించారు. డ్రైవర్ మద్యం సేవించకూడదని, నిమజ్జన వాహనంవెంట పిల్లలు రాకూడదని తెలిపారు. ప్రతివాహనానికి ఇన్‌ఛార్జ్‌ను నియమించుకోవాలని, పెద్దవిగ్రహాల నిమజ్జనానికి ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సూచనలు పాటించడం ద్వారా అవాంఛనీయ ఘటనలను నివారించవచ్చని తెలిపారు.

     

  • కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తుంది..

    వికారాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. కేసీఆర్ పేరు నిలిచిపోతుందన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ వద్ద పిల్లర్లను కావాలనే కుంగగొట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని ఆనంద్ విమర్శించారు.

     

  • బడా గణేశ్‌కు Sr.NTR పూజలు.. SMలో ఫోటో వైరల్!

    HYD: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేశుడిని 1954లో స్వాతంత్య్ర సమరయోధుడు సింగరి శంకరయ్య మొదటిసారిగా ప్రతిష్టించారు. మొదట్లో కేవలం అడుగు ఎత్తు ఉన్న ఈవిగ్రహం కాలక్రమేణా భారీగా పెరిగింది. ఈ బడా గణేశ్‌ను అనేకమంది ప్రముఖులు దర్శించుకుంటూ ఉంటారు. ఈక్రమంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకసారి ఖైరతాబాద్ గణేశుడికి పూజలు చేసిన పాతఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • ‘రోడ్డుపై బైఠాయించి మహిళ నిరసన’

    HYD: సీబీఐకి కేసు అప్పగించడాన్ని నిరసిస్తూ, సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకురాలు ఎర్ర జ్యోతి కారును పోలీసులు అడ్డుకోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె నిరసన విరమించారు. ఈ ఘటనతో సీతాఫలమండి కూడలి వద్ద గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మహా ధర్నా

    తెలంగాణ మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య వారికి మద్దతు తెలిపారు. 6నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ‘సమాన పనికి సమాన వేతనం’ అమలుచేసి, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని కోరారు. ఏజెన్సీలను తొలగించి, ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • వైఎస్సార్‌కు నివాళులర్పించిన మంత్రి సీతక్క

    HYD: మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్‌లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు పెద్దన్నగా నిలిచారని ఆమె కొనియాడారు.

  • ఇక నుంచి 3 నెలలకోసారి నల్లా బిల్లు!

    హైదరాబాద్ జలమండలి గృహ సముదాయాలకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై మూడు నెలలకు ఒకసారి నల్లా బిల్లు జారీ చేయనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాను పరిగణనలోకి తీసుకొని, మూడు నెలలకు కలిపి 60 వేల లీటర్ల వరకు రీడింగ్ ఉంటే బిల్లు ZERO BILL వస్తుందని ఆయన పేర్కొన్నారు.

     

     

  • జీవనశైలి మార్చుకోకుంటే.. ముప్పే!

    హైదరాబాద్‌లో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. అయితే, వీటిని నియంత్రించడం మన చేతుల్లోనే ఉందని నిపుణులు అంటున్నారు. రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం, వారానికి ఐదురోజులు క్రమం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. అలాగే, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు ఉండేలా చూసుకోవాలి. 6-7 గంటలు నిద్రపోవడం ద్వారా ఈ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

  • ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద బీఆర్ఎస్ నిరసన

    మేడ్చల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపుమేరకు ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈనిరసనతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

  • గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

    HYD: గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం పక్కన పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి (దాదాపు 60-65) డెడ్ బాడీని పోలీసులు గమనించారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.