HYD: భారత రైల్వే, ఎస్బీఐతో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల రైల్వే ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయి. ఒప్పందం ప్రకారం ఉద్యోగుల జీతాలు ఎస్‌బీఐ ద్వారా చెల్లించడం వల్ల వారికి రూ.1 కోటి ప్రమాద బీమా, విమాన ప్రమాద మరణానికి రూ.1.6 కోట్లు, రూపే కార్డుపై అదనంగా రూ.1 కోటి, శాశ్వత అంగవైకల్యానికి రూ.80 లక్షల బీమా అందుబాటులోకి వస్తాయి.
Locations: Hyderabad
-
గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు అదృశ్యం
HYD: గాంధీ ఆసుపత్రిలో నుంచి ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. బొంబాయి బాబు భార్య బొంబాయి శాంత (28), సత్యం భార్య వేముల నాగలక్ష్మి (55) కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరికీ కల్లు తాగే అలవాటు ఉండటం, కొన్ని రోజులుగా తాగకపోవడంతో మానసిక స్థిమితం కోల్పోయి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
పుణ్యక్షేత్రంలా ఖైరతాబాద్.. బడా గణేశ్ వద్ద తగ్గని రద్దీ
హైదరాబాద్:విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఖైరతాబాద్ ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిప్తోంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడచూసినా భక్తజనమే కనిపించింది. భారీగా వస్తున్న భక్తులను విడతలవారీగా శీఘ్ర దర్శనాలు చేయించి పంపేస్తున్నా, అంతలోనే మళ్లీ జనాలు క్యూలో నిండిపోతుండడంతో పోలీసులు అవస్థలు పడ్డారు.
-
నెలలు నిండని శిశువుకు అరుదైన వైద్యం
గుజరాత్‌లో నెలలు నిండకుండానే పుట్టిన శిశువుకు ప్రాణాంతక సమస్యలు తలెత్తాయి. 1.1 కిలోల బరువుతో పుట్టిన ఆ బిడ్డను తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితిలో 1300 కిలోమీటర్ల దూరం రోడ్డుమార్గంలో తీసుకొచ్చిన శిశువుకు డాక్టర్లు 2నెలలపాటు చికిత్స అందించారు. వైద్యుల కృషి, నిరంతర పర్యవేక్షణతో శిశువు ప్రాణాలు కాపాడగలిగారు. ఈగొప్పసేవకు చిన్నారి తల్లిదండ్రులు వైద్యులకు, కిమ్స్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
-
గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్ షా
HYD: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు కేంద్ర హోమంత్రి అమిత్ షా ఈ నెల 6వ తేదీన నగరానికి రానున్నారు. ఉదయం 11గంటలకు బేగంపేట్ రానున్న అమిత్ షా.. ITCకాకతీయలో BJPముఖ్యనేతలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 1గంటకు చార్మినార్ వద్ద వినాయక నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30కి MJమార్కెట్ వద్ద నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.
-
ఇంటింటా ఇంకుడు గుంత.. పద్మశాలి కాలనీ ప్రత్యేకత
HYD: ముషీరాబాద్‌లోని పద్మశాలికాలనీ ప్రజలు సమష్టి కృషితో నీటి ఎద్దడిని విజయవంతంగా ఎదుర్కొంటున్నారు. 1998 నుంచే వీరంతా ఇంటింటా ఇంకుడు గుంతలను నిర్మించుకుని భూగర్భ జలాలను కాపాడుతున్నారు. ఇళ్లపైపడే వాన నీటిని భూమిలోకి ఇంకేలా ప్రత్యేక పైపులైన్లను ఏర్పాటు చేసుకున్నారు. దీని ఫలితంగా వేసవిలో కూడా ఇక్కడ 60 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభిస్తుంది. ఐక్యంగా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
-
గణపతి దేవాలయంలో సాంస్కృతి కార్యక్రమాలు
HYD: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతి, దార్మిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. భూదన్ పోచంపల్లి వంకమామిడి గ్రామానికి చెందిన బడుగు నిఖిత కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకుంది. రమేష్ బాబు శిష్యరికంలో కూచిపూడిలో శిక్షణ పొందిన నిఖిత అనేక ప్రదర్శనల ద్వారా ఆహుతులను అలరించింది.
-
JNTU-జర్మనీ కోర్సు స్పాట్ ప్రవేశాలకు స్పందన కరవు
HYD: జేఎన్‌టీయూ-జర్మనీ వర్సిటీల ఎంవోయూ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం ప్రారంభమైన మరోవిడత స్పాట్ కౌన్సెలింగ్‌కు స్పందన కరవైంది. రెండేళ్ల డబుల్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఇన్ రెనెవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఇంటర్నేషనల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ఒక్కసీటు భర్తీ కాకపోవడం గమనార్హం. ఈస్పాట్ కౌన్సెలింగ్ 4వతేదీ వరకు కొనసాగుతుందని వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ కె.బాలునాయక్ చెప్పారు.
-
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
HYD: బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరగాయి. హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 210 పెరిగి రూ.1,06,090కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 200 పెరిగి రూ. 97,250గా పలుకుతోంది. ఇటు కేజీ వెండి ధర రూ.1,36,100గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-
నిజాం కాలం నాటి ‘బ్యారెక్స్’.. నేడు ‘బార్కస్’.. చరిత్రపై ఓ లుక్కేయండి!
నిజాం పాలనలో యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వచ్చిన అరబ్బులు, పఠాన్లు నిజాం సైన్యంలో పనిచేసేవారు. వారు కింగ్‌కోఠి నుంచి పాతబస్తీలోని తమ బసకు ఆయుధాలతో వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనితో నిజాం రాజువారి కోసం చాంద్రాయణగుట్ట దగ్గర ఆయుధాలు భద్రపరిచేందుకు ఒక గోదాం(బ్యారెక్స్) ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. కాలక్రమేణా ‘బ్యారెక్స్’ అనే పేరు ‘బార్కస్’గా మారింది.