Locations: Hyderabad

  • విమానాశ్రయంలో రూ.3 కోట్ల గంజాయి పట్టివేత

    రంగారెడ్డి: బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఒక యువతిని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులు అరెస్టు చేశారు. 23 ఏళ్ల ఈ యువతి తన లగేజీలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన 3.1 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఆమెపై అనుమానం రావడంతో తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయి విలువ రూ.3కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

  • హైదరాబాద్‌లో 10% పెరిగిన ఉద్యోగాలు

    ఐటీయేతర రంగాల్లో నియామకాలు పెరగడంతో ఆగస్టులో ఉద్యోగ మార్కెట్‌లో 3శాతం స్వల్ప వృద్ధి నమోదైంది. కృత్రిమ మేధ(AI), మెషిన్‌ లెర్నింగ్‌(ML) ఉద్యోగాలకూ గిరాకీ పెరిగిందని నౌక్రీ జాబ్‌స్పీక్‌ నివేదిక వెల్లడించింది. బీమా రంగం 24శాతం నియామక వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆతిథ్యంలో 22%, స్థిరాస్తిలో 18శాతం మేరకు ఉద్యోగాలు పెరిగాయి. హైదరాబాద్‌ నియామకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధి కనిపించింది.

  • ఆకు కూరలను కోస్తుంది..కట్టలు కడుతుంది

    HYD: ఆకుకూరలను కోసి కట్టలు కట్టే రొబాటిక్‌ యంత్రాన్ని రూపొందించారు రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ కేజీరెడ్డి కళాశాల విద్యార్థులు. కళాశాల డైరెక్టర్‌ రోహిత్‌ ప్రోత్సాహంతో అధ్యాపకురాలు ఉదయ మార్గనిర్దేశంలో రొబాటిక్‌ కోత యంత్రం(హార్వెస్టర్‌) నమూనాను రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌కు తీసుకొచ్చారు. దీనికి వర్సిటీ ఇంక్యుబేటర్‌లో చోటు కల్పించి ఆధునికీకరించారు. అగ్రిహబ్‌లో వ్యవసాయవర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య చేతుల మీదుగా ఈ యంత్రాన్ని ఆవిష్కరించారు.

  • సైన్స్‌ టీచర్‌గా రాణిస్తూనే.. మిసెస్‌ ఇండియా టైటిల్‌

    హైదరాబాద్‌కు చెందిన పల్లవి.. టీనేజ్‌లోనే మోడల్ కావాలని కలలు కన్నది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు పూర్తి చేసి, సైన్స్ టీచర్‌గా స్థిరపడింది. పెళ్లి తర్వాత తన కలను వదులుకోలేదు. భర్త మద్దతుతో 29 ఏళ్ల వయస్సులో మిసెస్ ఇండియా టైటిల్‌ గెలుచుకుంది. లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే విజయం ఆలస్యమైనా దక్కుతుందని పల్లవి నిరూపించింది.

  • రాజ్యాంగాన్ని మార్చేందుకే ఎన్డీయే యత్నం: సీఎం రేవంత్

    TG: రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రమాదకర ఆలోచనతో ఎన్డీయే కూటమి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి మనుగడ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు.

  • కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ

    HYD: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పుగూడ శ్రీ విఘ్నేశ్వర సాయి ధామంలో ఏర్పాటు చేసిన గణపతికి సోమవారం ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రీ మల్లికార్జున యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువైన వంద రూపాయల నోట్లతో గణనాథుడిని సుందరంగా అలంకరించారు. ఈ కరెన్సీ అలంకరణను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

     

  • ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు

    HYD: షాద్ నగర్ కాలనీ వాసులు తమవిద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకువచ్చారు. 2వ వార్డులోని తిలక్ నగర్ కాలనీలో పర్యటించిన సందర్భంగా, కాలనీ వాసులు విద్యుత్ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి సోమవారం నాడు ట్రాన్స్ఫార్మర్‌ను  బిగించేలా చర్యలు తీసుకున్నారు. కాలనీ వాసుల సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే శంకర్ కు  కృతజ్ఞతలు తెలిపారు.

  • ‘నిమజ్జనంపై వికారాబాద్ సీఐ హెచ్చరిక’

    వికారాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని వికారాబాద్ సీఐ భీమ్ కుమార్ సూచించారు. నిన్న కమలా నగర్‌లో జరిగిన గొడవపై కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి, ప్రజల శాంతికి భంగం కలిగించినా లేదా డీజేలు వాడినా నిర్వాహకులపై, డీజే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

  • 1300 కి.మీ ప్రయాణించి శిశువు ప్రాణాలు కాపాడారు

    HYD: సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు గుజరాత్‌లోని సూరత్ నుంచి 1300 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి నవజాత శిశువును హైదరాబాద్‌కు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుకు పలు అవయవాలు విఫలమయ్యాయి.  క్లిష్టమైన సమయంలో, డాక్టర్ బాబు ఎస్. మాదర్కర్‌తో సహా 31 మంది వైద్యసిబ్బంది ఆపరేషన్‌లో నిరంతరంగా శ్రమించారు. రెండునెలల చికిత్స అనంతరం శిశువు పూర్తిగా కోలుకుంది.

  • హైడ్రా ప్రజావాణిలో వరద ముప్పుపై ఫిర్యాదులు

    హైదరాబాద్‌లోని హైడ్రా ప్రజావాణికి వర్షాకాల వరద ముప్పుపై 43 ఫిర్యాదులు అందాయి. కాలువల్లో అడ్డంకులు, కబ్జాల వల్ల తమ నివాసాలు మునిగిపోతున్నాయని పలువురు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని ఒక రోడ్డుపై అక్రమ నిర్మాణాలు, శేరిలింగంపల్లిలోని గోపన్నపల్లి చెరువు కబ్జాపై ఫిర్యాదులు వచ్చాయి. హయత్‌నగర్ బీఎన్‌రెడ్డి డివిజన్‌లో మురుగునీటి కాలువలను మళ్లించడం వల్ల 16 కాలనీలు మునిగిపోతున్నాయని  ఫిర్యాదు చేశారు.