రంగారెడ్డి: చేవెళ్ల మండలం, అంతారం గ్రామంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆర్. అంజన్న ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. 6 టీంలు పాల్గొన్న ఈ పోటీలో విజేతలకు రూ.3 వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.2 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.1 వేలు బహుమతులుగా అందజేశారు. యువత క్రీడలపై ఆసక్తి చూపాలని, త్వరలో మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తానని అంజన్న తెలిపారు.
Locations: Hyderabad
-
అశోక్ లేలాండ్ కార్యాలయంలో అన్నదానం
మేడ్చల్: బోయిన్‌పల్లిలోని మాలిక్ మోటార్స్ అశోక్ లేలాండ్ కార్యాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బిజినెస్ హెడ్ విజయ్ కుమార్, ఫైనాన్స్ విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో, అన్నదానంలో ఉద్యోగులు, వాహన యజమానులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు.
-
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం: కాంగ్రెస్ సంబరాలు
మేడ్చల్: శాసనసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు గజ్జెల కాంతం, శశికళ యాదవ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వజ్రేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
వికారాబాద్‌లో ప్రజావాణి: 86 ఫిర్యాదులు
వికారాబాద్: ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఇతర అధికారులు సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
-
వికారాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం
వికారాబాద్: కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు నిరసనగా వికారాబాద్‌లోని పి.జె.ఆర్. చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, కాలేశ్వరంపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కేసులు పెట్టినా తమపోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
-
తెలంగాణ కీర్తిని పెంచిందని పద్మారావు గౌడ్ ప్రశంస
HYD: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి చేపుర్వ ప్రవళికను సత్కరించారు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా కప్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినందుకు ఆమెను అభినందించారు. ప్రవళిక తెలంగాణ కీర్తిని పెంచిందని పద్మారావు గౌడ్ ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
-
మోండా మార్కెట్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యం
HYD: మోండా మార్కెట్‌ను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపడటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లి ఎరుకల బస్తీలో రూ. 61.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కార్పొరేటర్ కొంతం దీపికలతో కలిసి ఆయనభూమి పూజ చేశారు. ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అదనపు నిధులు కేటాయించారని వివరించారు.
-
జస్టీస్ సుదర్శన్ రెడ్డిని కలిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే
HYD: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టీస్ సూదర్శన్ రెడ్డిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిచయం చేసారు. జస్టీస్ సుదర్శన్ రెడ్డితో శ్రీగణేష్ కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తప్పకుండా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
900కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను జోనల్ రైల్వే బోర్డు సభ్యుడు కొల్లి నాగేశ్వర రావు సందర్శించి ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 3న రైల్ నిలయంలో జరిగే ప్రయాణికుల సలహా కమిటీ సమావేశంలో చర్చించ నున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యమే లక్ష్యంగా ₹ 900కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
-
మేడ్చల్ జిల్లాలో కొత్తగా 14 గ్రంథాలయాలు
మేడ్చల్: మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రస్తుతం 18 శాఖా గ్రంథాలయాలు నడుస్తున్నాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా జనాభాను దృష్టిలో పెట్టుకుని మరో 14 కొత్త శాఖా గ్రంథాలయాల ఏర్పాటుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, త్వరలోనే కొత్త గ్రంథాలయాలకు అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.