Locations: Hyderabad

  • బేతేనియ ప్రార్థన మందిరం వార్షికోత్సవం

    మేడ్చల్: హైదర్ నగర్ డివిజన్, తులసి నగర్‌లో ఉన్న బేతేనియ ప్రార్థన మందిరం 25వ వార్షిక మహోత్సవానికి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కేక్ కట్ చేసి, మందిరం సభ్యులకు, యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రె.వ.ఎ.ఇ. సీయోను రాజు, జీ. సముయేలు, పాస్టర్ ఆర్. పి. దాస్, రాయుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

  • ‘రైతుల ప్రయోజనాలకే మార్కెట్ కమిటీలు’

    రంగారెడ్డి: మార్కెట్ కమిటీలు రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి సూచించారు. సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్‌ను సందర్శించిన ఆయన, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పనితీరును అభినందించిన ఆయన, రైతులు తీసుకొచ్చిన సరుకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో చొరవ చూపాలని అన్నారు.

  • ‘నేటి జీవనశైలితో ఫిజియోథెరపీ అవసరం’

    HYD: ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మహేశ్వరం జీజీహెచ్‌కు చెందిన డాక్టర్ రూపేశ్ ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను వివరించారు. నేటి జీవనశైలి కారణంగా ఫిజియోథెరపీ అవసరం బాగా పెరిగిందని ఆయన తెలిపారు. మందులు, సర్జరీ లేకుండానే ఫిజియోథెరపీ ద్వారా మోకాళ్లు, కీళ్లు, ఎముకలు, కండరాల నొప్పులను నయం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా కదలికలు లేకపోవడం వల్ల వచ్చే సమస్యలకు ఇదిమంచి పరిష్కారం అని వెల్లడించారు.

  • మోటర్ ఆన్ చేయబోగా కరెంట్ షాక్.. సంపులో పడి మహిళ మృతి

    వికారాబాద్: కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. లింగంపల్లి విజయలక్ష్మి (36) అనే మహిళ నీళ్లు పట్టుకోవడానికి మోటార్ పెట్టబోయి కరెంట్ షాక్ తగిలి సంపులో పడి మృతి చెందింది. ఈ ఘటనపై భర్త లింగంపల్లి చిన్న వెంకటయ్య ఫిర్యాదు మేరకు కుల్కచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
  • రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మృతదేహం

    HYD: సంజీవయ్య పార్క్-జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పక్కన ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సుమారు 45-50 సంవత్సరాల వయసు గల మృతుడి కుడి చేతిపై ‘లక్ష్మీ నరసింహ స్వామి’ పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. అతను అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

  • గంజాయి మత్తులో యువకులు హల్‌చల్(VIDEO)

    HYD: గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లో గంజాయి మత్తులో నలుగురు యువకులు రోడ్డుపై హల్ చల్ చేశారు. అటుగా  వెళ్తున్న ఓ వ్యక్తిని అకారణంగా చితకబాదడమే కాకుండా, అక్కడే ఉన్న టీ స్టాల్ నిర్వాహకుడిపై దాడి చేయడంతో పాటు, సామాగ్రిని ధ్వంసం చేశారు. స్థానికులు వెంటనే గంజాయి మత్తులో ఉన్న ఇద్దరి యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ముడుపులు తీసుకుని కరెంట్ మీటర్లు

    HYD: అయ్యప్ప సొసైటీలో అక్రమ విద్యుత్ కనెక్షన్లపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సరైనపత్రాలు లేకుండా, GHMC నుంచి ఓసీ ఇవ్వకుండానే భారీ ముడుపులు తీసుకుని కరెంట్ మీటర్లు ఇచ్చారని బాధితులు ఫిర్యాదు చేశారు. లైన్‌మెన్‌ల నుంచి ఎస్ఈ స్థాయి అధికారుల వరకు ఇందులో భాగమని ఆరోపణలు ఉన్నాయి. మీటర్ల మంజూరుకు లక్షల్లో వసూలు చేశారని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది.

  • దమ్ బిర్యానీ బోర్ కొట్టిందా?.. HYDలో 5 వెరైటీ బిర్యానీలివే..!

    హైదరాబాద్ అంటే కేవలం సంప్రదాయ దమ్ బిర్యానీ మాత్రమే కాదు. ఇప్పుడు నగరంలో కొత్త రుచుల కోసం వెతుకుతున్న బిర్యానీ ప్రియుల కోసం కొన్ని వినూత్న రకాలు అందుబాటులోకి వచ్చాయి. సుఫియాని బిర్యానీ, షాహీఘో బిర్యానీ, ఎమ్మెల్యే పోట్లం బిర్యానీ, కరాచీ-స్టైల్ ఆలూ బిర్యానీ, నల్లి ఘోష్ బిర్యానీలు ఉన్నాయి. వీటిలో మీరెవరైనా ఆరగించి ఉంటే దేని టేస్ట్ బాగుంటుందో కామెంట్ చేయండి.

  • నాగారంలో డ్రైనేజ్, నీటి సమస్యలపై ఫిర్యాదు

    HYD: నాగారం మున్సిపల్ 9వ వార్డులోని విజయపురి కాలనీ అనురాగ్ సిరి రెసిడెన్సీలో డ్రైనేజ్, నీటి సమస్యలను మున్సిపల్ డీఈ సంతోష్ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఈ సమస్యలను వివరించగా, డీఈ సానుకూలంగా స్పందించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

  • ప్రజావాణిలో కార్పొరేటర్ ఫిర్యాదులు

    మేడ్చల్: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రవణ్ పలు ఫిర్యాదులు చేశారు. మారుతినగర్, ఓల్డ్ మల్కాజ్గిరి, నేరెడ్‌మెట్, విష్ణుపూరిలలో పార్కుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని, లైబ్రరీకోసం ఒకగదిని కేటాయించాలని కోరారు.  వర్షాల కారణంగా నిలిచిపోయిన రోడ్డుపనులను తిరిగి ప్రారంభించాలని  కోరారు. మధ్యతరగతి వారి ఇంటి పర్మిషన్ దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో పెట్టారని, వాటికివెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.