Locations: Hyderabad

  • ‘ఈఫిల్‌ టవర్‌’ ఆఫ్‌ హైదరాబాద్‌

    మలక్‌పేట టీవీ టవర్.. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలలో ఒకటి. 1977లో నిర్మించిన ఈ 229 మీటర్ల ఎత్తైన టవర్ ను, స్థానికులు ‘హైదరాబాద్‌ ఈఫిల్‌ టవర్‌’ అని పిలుస్తారు. దీని నిర్మాణానికి ముందు ఈ స్థలంలో ఖలీద్‌ అబ్దుల్‌ ఖయ్యూం వంటి క్రికెటర్లు ప్రాక్టీస్ చేసేవారు. తొలుత రేడియో ప్రసారాల కోసం దీనిని ఉపయోగించగా, 1992 నుంచి టెలివిజన్‌ ట్రాన్స్‌మిషన్‌ టవర్‌గా మారింది.

  • దొంగిలించిన ఫోన్‌ నుంచి రూ. 6 లక్షలు అపహరించిన దుండగుడు

    HYD: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మోసం జరిగింది. నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్‌రావు బోయిన్‌పల్లిలో నాందేడ్‌కు చెందిన బస్సు ఎక్కుతుండగా.. గుర్తు తెలియని దుండగుడు సెల్ ఫోన్ దొంగిలించాడు. అనంతరం దొంగిలించిన సెల్ ఫోన్ నుంచి రెండు బ్యాంకు ఖాతాల ద్వారా రూ. ఆరు లక్షల నగదుని  దుండగుడు అపహరించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

  • రైలు కిందపడి విద్యార్థిని సూసైడ్

    HYD: ఘట్ కేసర్ రైల్వే బ్రిడ్జి వద్ద ఒక బీటెక్ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని విజ్ఞాన్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న హిత వర్షినిగా గుర్తించారు. చివరిసారిగా ఆమె వినయ్ అనే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే రైలు ఢీకొడితే చనిపోతామా? అంటూ రెండు రోజుల క్రితం తన తండ్రిని వర్షిని అడిగినట్లు తెలుస్తోంది.

  • జూబ్లీహిల్స్ తర్వాతే..?

    HYD : BC రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలడం కష్టమని ప్రచారం జరుగుతున్నది. ఈలోపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం అవుతోంది. బీహార్ ఎన్నికల షెడ్యూలుతోపాటు జూబ్లీహిల్స్ బై పోల్‌ షెడ్యూలు సైతం విడుదలయ్యే ఛాన్స్ ఉన్నది. ఇప్పటికే తుది ఓటర్ల లిస్టును ECప్రకటించింది. ఈ లోపు BCరిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చినా, వెంటనే ఎన్నికలు నిర్వహణ కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

  • అల్లు అరవింద్‌కు GHMC నోటీసులు

    ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు GHMC అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయనకు చెందిన వాణిజ్య భవనంపై అనుమతులు లేకుండా పెంట్‌హౌస్ నిర్మించడమే ఇందుకు కారణం. ముందస్తు అనుమతులు లేకుండా నిర్మించిన ఈ పెంట్‌హౌస్‌ను అక్రమ నిర్మాణంగా పరిగణించి, ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వకుంటే కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • ఈఫిల్‌ టవర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌

    HYD: మలక్‌పేట TVటవర్, ఈఫిల్‌ టవర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా ప్రాచుర్యంలో ఉంది. 1977లో జాతీయరహదారి దిల్‌సుఖ్‌నగర్‌-చాదర్‌ఘాట్‌ మార్గంలో దీన్ని నిర్మించారు. 750అడుగులు ఎత్తుతో అప్పట్లో ఇది హైదరాబాద్‌లో ఎత్తైన నిర్మాణాలలో ఒకటిగా నిలిచింది.

  • రవీంద్ర భారతి ప్రాంగణంలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం

    HYD : గాన గంధర్వుడు, దివంగత గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం పక్కనే SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధ్యతలను రాష్ట్ర సాంస్కృతిక శాఖకు అప్పగించింది.

  • ‘CA పరీక్షలకు సన్నద్ధమవుతున్నాం’

    HYD: ‘అవిభక్త కవలలుగా జన్మించాం.. ఊహ తెలిసినప్పటి నుంచి కలిసే ఉన్నాం.. డిగ్రీ పూర్తిచేశాం..  ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ కావాలనుకుంటున్నాం’’ అని వీణా-వాణిలు చెప్పారు.

  • బాలాపూర్ గణేష్ హుండీ ఆదాయం ₹23 లక్షలు

    HYD: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీ ద్వారా మొత్తం ₹23,13,760 రూపాయల ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం భక్తులు విశేషసంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి కానుకలు సమర్పించినట్లు పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని వెల్లడించారు.

     

  • సమస్యల పరిష్కారానికి కమిషనర్‌కు వినతి

    మేడ్చల్: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ మండల శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించింది. వర్షాల వల్ల గుంతలమయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఐ కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. మురికి కాల్వలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కొత్త ఇళ్లకు నెంబర్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.