HYD: బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్నికలు జరపకూడదని బీసీ సంక్షేమసంఘం అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు జజూల శ్రీనివాస్ గౌడ్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం అన్యాయమని నేతలు అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధం చేసిన తర్వాతే ప్రక్రియ కొనసాగాలని వారు పేర్కొన్నారు.
Locations: Hyderabad
-
ఉద్యోగం దొరకలేదని ఆత్మహత్య
HYD: పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఉద్యోగం దొరకలేదని ఝార్ఖండ్‌కు చెందిన అహ్మద్ ఫహీమీ(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఫహీమీ దుబాయ్‌లో రెండున్నరేళ్లు పనిచేసి, ఈఏడాది జనవరిలో ఉద్యోగం లేకపోవడంతో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. శనివారం తన గదిలో శీతలపానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగాడు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
అమెరికా పత్తి దిగుమతి సుంకం రద్దుపై కాంగ్రెస్ విమర్శ
HYD: అమెరికా పత్తిపై 11% దిగుమతి సుంకం రద్దుచేయడం రైతులపై మోడీ ప్రభుత్వ ద్రోహమని కాంగ్రెస్ నాయకుడు నుమాన్ మొహమ్మద్ విమర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లోని పత్తిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత ఉత్పత్తివ్యయం ఎక్కువగా ఉండటంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని తెలిపారు. రైతుల రక్షణకోసం దిగుమతి సుంకం పునరుద్ధరించాలని, కనీస మద్దతుధరను పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
-
చర్లపల్లి డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
HYD: చర్లపల్లి డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ 12 మందిని అరెస్టు చేసింది. ఈకేసులో ప్రధాన నిందితుడు ఓలేటి విజయ్, మహారాష్ట్ర యువకులతో కలిసి డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. వాగ్దేవి ఫార్మాస్యూటికల్స్‌తో పాటు మరో 2కెమికల్ ఫ్యాక్టరీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీని కూడా నడుపుతున్నాడు. గతపదేళ్లుగా విజయ్ ముంబై మాఫియాతో సంబంధాలు కొనసాగిస్తూ డ్రగ్స్ తయారుచేసి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ చీఫ్!
తెలంగాణ పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి వెళ్లిన ఆయన అల్లు అర్జున్‌తో మాట్లాడారు. ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతి చెందిన నేపథ్యంలో, అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆయన దేవుడిని ప్రార్థించారు.
-
VIDEO: బతుకుదెరువు కోసం చిట్టితల్లి సర్కస్ ఫీట్లు👌
HYD: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వినాయక నిమజ్జనోత్సవంలో తమ ఐదేళ్ల కుమార్తెతో సర్కస్ ఫీట్లు చేయించింది. ఈ చిన్నారికి 2నెలల శిక్షణ ఇచ్చామని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే పేరుగాంచిన ఉత్సవాల వద్దకు వెళ్లి ఇలాగే ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. బాలికను పాఠశాలకు పంపిస్తున్నామని తల్లి చెప్పింది. ఈ దృశ్యం నిమజ్జనోత్సవంలో భక్తులను ఆకట్టుకుంది.
-
ట్యాంక్ బండ్‌పై కన్నీళ్లు తెప్పించే దృశ్యం😭
HYD: ట్యాంక్ బండ్‌పై జరిగిన గణేశ్ నిమజ్జనం వేడుకల్లో అటు ఆనందం, ఇటు ఆర్తనాదం కనిపించాయి. భక్తులు ఉత్సాహంగా, ఆటపాటల్లో మునిగి ఉండగా..సెక్రటేరియట్ ఎదుట ఒక తల్లి మాసిపోయిన చీరతో, ఒంటినిండా గాయాలతో భిక్షాటన చేస్తూ కనిపించింది. దిక్కుతోచని స్థితిలో ఆమె కొడుకు దీనంగా చూస్తుండిపోయాడు. ఈదృశ్యం చూసి భక్తులు చలించిపోయారు. ఈభిన్నమైన పరిస్థితులు నిమజ్జనం రోజున అక్కడ నెలకొన్న వ్యత్యాసాలను సూచించాయి.
-
జూబ్లీహిల్స్ బైపోల్.. ఈనెల 30 తుది ఓటరు జాబితా
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఓటరు నమోదు, మార్పుల కోసం ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం చేపట్టారు. కొత్తఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, చేర్పులకు ఈనెల 17వతేదీ వరకు అవకాశం కల్పించినట్లు కమిషనర్ ఆర్వీ కర్జన్ తెలిపారు. జులై 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ 30వతేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని కర్జన్ వెల్లడించారు.
-
మైత్రీవనం HMDA ఆఫీసు ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద సోమవారం రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు ఆందోళనకు దిగారు. తక్కువ ధరకు తమ భూములను సేకరిస్తున్నారని ఆరోపిస్తూ హెచ్‌ఎండీఏ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. చౌటుప్పల్ దగ్గర పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా..సెప్టెంబర్ 15 లోపు అభ్యంతరాలు తెలపాలని అధికారులు కోరిన సంగతి తెలిసిందే.
-
మేడ్చల్ లడ్డూ వేలంలో రికార్డు ధర
మేడ్చల్: శ్రీరంగవరంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో రికార్డు ధర పలికింది. రెడ్డి సంఘం ప్రతిష్టించిన గణనాధుని లడ్డూను సద్ది రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రూ. 2.23 లక్షలకు దక్కించుకున్నారు. గణనాధుని పవిత్ర లడ్డూను వేలంపాటలో దక్కించుకున్న రాజశేఖర్ రెడ్డిని రెడ్డి సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.