వికారాబాద్: బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకం కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పీడీఎస్‌యూ జిల్లా కమిటీ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులపై ప్రైవేటు పాఠశాలలు బకాయిల కోసం ఒత్తిడి చేస్తున్నాయని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
Locations: Hyderabad
-
ఆదర్శ గ్రామం.. మద్యం అమ్మినా, కొన్నా.. రూ.5 లక్షల ఫైన్!👌
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన చెందిన గ్రామపెద్దలు, మహిళా, యువజన సంఘాలు ఈమేరకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈనిర్ణయాన్ని ఉల్లంఘించి ఎవరైనా మద్యం అమ్మినా, కొన్నా..రూ.5లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
-
‘RRR అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలి’
HYD: RRR అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ‘త్రిపుల్ ఆర్ వద్దురా.. వ్యవసాయ భూములే ముద్దురా’ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య గురించి పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చిన పరిష్కారం దొరకడంలేదని, రోడ్లపేరుతో భూములను లాక్కునే ప్రయత్నాన్ని మానుకోవాలని తెలిపారు.
-
పోలీసుల అత్యుత్సాహం.. భక్తుడిపై దాడి (వీడియో)
HYD: షేక్‌పేట్ వద్ద వినాయక నిమజ్జనం రోజు గోల్కొండ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శోభాయాత్రను త్వరగా ముగించాలని భక్తులను ఒత్తిడి చేశారు. ‘సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది సార్’అని భక్తుడు స్పందించగా..పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈక్రమంలో తోపులాట జరిగి రాకేష్ అనే భక్తుడిపై సీఐ సైదులు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు భక్తులు ప్రకటించారు.
-
బిట్ కాయిన్ పేరుతో యువతి వల.. రూ.27 లక్షలు స్వాహా!
HYD: మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమైన ఓ యువతి చాంద్రాయణగుట్టకు చెందిన యువకుడిని మోసం చేసింది. తాను లండన్‌లో ఉంటున్నానని పరిచయం చేసుకున్న యువతి.. బిట్‌కాయిన్‌లలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికింది. దీంతో బాధితుడు రూ.27.50 లక్షలు సేకరించి పెట్టుబడి పెట్టాడు. తర్వాత విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా..భారీగా పన్ను చెల్లించాలని డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
వారు కానరాని లోకాలకు వెళ్లి.. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపి❤️
ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇద్దరు యువకుల అవయవదానం పలవురికి జీవనదానం చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మారెళ్ల అభిలాష్(28), నిజామాబాద్ జిల్లాకు చెందిన బుర్రా రాజేశ్(33) మరణిస్తూ తమ అవయవాలను దానంచేశారు. అభిలాష్ కాలేయం, 2మూత్రపిండాలను దానం చేయగా..రాజేశ్ కాలేయం, 2కార్నియాలను దానంచేశారు. ఈగొప్ప నిర్ణయం పట్ల జీవన్‌దాన్ ప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
-
బ్రాండింగ్‌కు రోల్ మోడల్‌గా ‘గాంధీ హాస్పిటల్’
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు కార్పొరేట్ లుక్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈబ్రాండింగ్ ప్రక్రియకు గాంధీ ఆసుపత్రిని రోల్ మోడల్‌గా ఎంచుకుంది. రోగి ఆసుపత్రిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు సమూల మార్పులు తీసుకొస్తారు. రిసెప్షన్, ఓపీ కౌంటర్లు, సిబ్బందికి యూనిఫామ్‌లు ఆధునికంగా ఉంటాయి. మొదటిదశలో 202 ఆసుపత్రులకు ఈ బ్రాండింగ్ తీసుకురానున్నారు. ఈచర్యలు ఆసుపత్రుల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
-
WOW.. లోపల వెలుతురు.. వెలుపల పచ్చదనం
HYD: సికింద్రాబాద్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వద్ద ఓ బహుళ అంతస్తుల అద్దాల భవనమిది. దాని యజమాని వినూత్న ఆలోచనతో ఆకులతో ముద్రించిన గ్లాసులను నిలువుగా అమర్చారు. ఫలితంగా లోపల వెలుతురు రావడంతోపాటు వెలుపల పచ్చదనం చూపరులను ఆకట్టుకుంటోంది.
-
యువకుల ప్రాణాలు తీసిన అతివేగం
HYD: గండిగూడకు చెందిన నిఖిల్, చింటూ అనే ఇద్దరు యువకులు అతివేగంతో ప్రయాణిస్తుండగా మదనపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. వీరు గండిగూడ నుంచి పాలమాకుల వైపు వెళ్తుండగా, రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఏర్పాటుచేసిన బార్గేట్‌ను బలంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ చనిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
-
‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది’
HYD: ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు కేంద్రం వివక్ష చూపుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల తయారీ, సరఫరాపై కేంద్రానికే పూర్తి అధికారం ఉందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందని ఒప్పుకున్న మంత్రి, ఈ సమస్యకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు.