Locations: Hyderabad

  • నర్సింగ్ కోర్సుతో బెస్ట్ కెరీర్!

    తెలంగాణ ప్రభుత్వం నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)తో ఒప్పందం చేసుకోనుంది. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలను రాష్ట్రయువతకు అందుబాటులోకి తీసుకురావడమే ఈకార్యక్రమం లక్ష్యం. కోవిడ్ తర్వాత నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, విదేశీభాషల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

  • అమెరికాకు వద్దు బ్రో!

    TG: అమెరికాలో భారతీయులకు నిరుద్యోగం, పెరుగుతున్న ఖర్చులతో కష్టాలు ఎదురవుతున్నాయి. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం..నిరుద్యోగుల సంఖ్య వారానికి 8వేల చొప్పున పెరుగుతోంది. కేవలం 6వారాల్లో ఐటీ రంగంలోనే దాదాపు 5.8 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ట్రంప్ టారిఫ్‌లు విధించడం కూడా ఉద్యోగాల కోతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈపరిస్థితులు కొత్తగా వెళ్లే విద్యార్థులను, ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

  • BC అభ్యర్థిత్వం వైపు కాంగ్రెస్ మొగ్గు?

    HYD: కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో BCఅభ్యర్థిత్వంపై మొగ్గు చూపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది! ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువనేత నవీన్‌ యాదవ్, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, మాజీ MPఅంజన్‌కుమార్‌ యాదవ్, విద్యావేత్త భవానీశంకర్‌ తదితరులు ఆసక్తి కనబర్చుతున్నారు. వారి ఆర్ధిక బలాబలాలు, రాజకీయ, కుటుంబ నేపథ్యం, ప్రజల్లో వారిపై గల పలుకుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధిత్వాన్ని పరిశీలిస్తోంది.

  • శభాష్ పోలీసన్నా.. లేబర్‌గా చేరి.. లోగుట్టు పట్టి..

    హైదరాబాద్‌లోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రూ.12వేల కోట్ల డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించడానికి మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. నెలరోజుల ముందే ఓపోలీస్ అధికారి కార్మికుడిగా చేరి..పూర్తిసమాచారం సేకరించిన తర్వాత ఆకస్మిక దాడులు చేసి ఈ రాకెట్‌ను బయటపెట్టారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి గత పదేళ్లుగా మెఫిడ్రోన్ (ఎండీ) డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

  • గ్రేటర్‌లో 3.3 లక్షల గణేష్‌ విగ్రహాల నిమజ్జనం

    గ్రేటర్ హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. గ్రేటర్‌లో ఆదివారం సాయంత్రం వరకు 3.3 లక్షల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఇందుకోసం 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్యం, లైటింగ్, రోడ్డు మరమ్మతుల వంటి పనులను పకడ్బందీగా నిర్వహించారు. నిమజ్జనం అనంతరం 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించినట్లు పేర్కొన్నారు.

  • టీపీసీసీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన వజ్రేష్‌యాదవ్

    మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్‌గౌడ్ సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్ ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్‌గౌడ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ బలోపేతానికి, పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు.

  • HYD: ఐదేళ్లు @ 207 ‘బర్డ్ హిట్స్’

    HYD: విమానాలకు పక్షుల తాకిడి(బర్డ్ హిట్స్) పెరిగిపోవడంతో విమానయాన సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 2020 నుంచి ఈఏడాది జూన్ వరకు దేశంలో 2,807 బర్డ్ హిట్స్ నమోదు కాగా..వీటిలో 207 హైదరాబాద్‌లోనే జరిగాయి. పక్షి తాకిడితో ఇంజిన్, రెక్కలు, విమానం ముందు భాగం దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఇది అత్యవసర ల్యాండింగ్‌కు దారితీస్తుంది. విమానాశ్రయాల చుట్టూ జనావాసాలు, ఆహార వ్యర్థాలు పెరగడం ఈసమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

  • 9 నుంచి అఖిల భారత జైల్‌ డ్యూటీ మీట్‌-2025

    తెలంగాణ జైళ్లు, సవరణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైల్ డ్యూటీమీట్-2025 ఈనెల 9 నుంచి 11వతేదీ వరకు హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనుంది. 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1300 మంది జైలుసిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. గవర్నర్ జిష్టుదేవ్‌వర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ఈకార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

  • బంజారాహిల్స్‌లో కొబ్బరి బోండాలు చోరీ

    HYD: బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 14లో కొబ్బరి బోండాలను ఆటో డ్రైవర్ చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో ఆటోలో వచ్చిన ఒక వ్యక్తి, కొబ్బరి బోండాలను కప్పి ఉన్న కవర్‌ను కత్తితో కట్ చేసి, వాటిని ఆటోలోకి ఎక్కించుకున్నాడు. ఈ చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

  • రోడ్డెక్కిన మురుగు.. పట్టించుకునేవారేరీ?

    HYD: నందిహిల్స్ నుండి వచ్చే మురుగునీరు షేక్‌పేట్-రాయదుర్గం ప్రధాన రహదారిపై ప్రవహించి వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. బీఎన్‌ఆర్ హిల్స్ సొసైటీలోని ఇళ్ల నుండి వచ్చే వ్యర్థజలాలు ప్రధాన రహదారిపైకి నేరుగా వదులుతుండటంతో రోడ్డు బురదమయంగా మారి దుర్వాసన వస్తోంది. నెలల తరబడి కొనసాగుతున్న ఈసమస్యతో స్థానికులు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈసమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.