హైదరాబాద్ శివారు చర్లపల్లిలో వందల కోట్లరూపాయల విలువైన డ్రగ్స్ తయారీ రాకెట్‌ను మహారాష్ట్ర పోలీసులు ఛేదించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూలీల వేషంలో వచ్చి ఓ సాధారణ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తయారీతో పాటు అమ్మకాలు కూడా హైదరాబాద్‌లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.