Locations: Hyderabad

  • చర్లపల్లి డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

    హైదరాబాద్ శివారు చర్లపల్లిలో వందల కోట్లరూపాయల విలువైన డ్రగ్స్ తయారీ రాకెట్‌ను మహారాష్ట్ర పోలీసులు ఛేదించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూలీల వేషంలో వచ్చి ఓ సాధారణ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తయారీతో పాటు అమ్మకాలు కూడా హైదరాబాద్‌లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.

     

     

     

  • రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా?

    మేడ్చల్‌: ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా రోడ్లకు మరమ్మతులు చేసేందుకు మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

     

  • గ్రేటర్‌ @ 31.0 డిగ్రీలు

    హైదరాబాద్‌లో ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ ఉక్కపోత మొదలైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.4డిగ్రీలు, గాలిలో తేమ 54శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

  • నత్తనడకన ఫ్లైఓవర్ పనులు.. ట్రాఫిక్‌తో ఇబ్బందుల్లో ప్రజలు

    HYD: చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో స్థానికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, ధూళి కాలుష్యంతో ప్రజలు విసిగిపోయారు. పనులు మొదలై నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న కాంక్రీట్, ఇనుప కడ్డీలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీనితో ఉద్యోగులు, విద్యార్థులు ఆలస్యంగా చేరుకుంటున్నరని ఆందోళన వ్యక్తం చేశారు.

     

  • బోల్లారంలో దారుణ హత్య.. యువకుడిని చంపి డోర్ డెలివరీ

    హైదరాబాద్ శివారులోని ఐడీఏ బోల్లారం మున్సిపల్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. కేబీఆర్ కాలనీలో నివసించే  జయప్రకాశ్(22)ని దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఒంగోలు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • బైక్‌ను ఢీకొన్న కారు.. ఒకరికి తీవ్రగాయాలు

    HYD: టోలిచౌకిలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ కారు రాపిడో బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ రైడర్లు వేణు, ఆసిఫ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారుడ్రైవర్‌తో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

     

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    HYD: కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.99,350 గా పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ. 1000 తగ్గి రూ.1, 37,000 వద్ద కొసాగుతుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే దరలు కొనసాగుతున్నాయి.

  • సినీ నటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు!

    సినీనటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్‌ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు.

  • అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో 2 రోజులు తాగునీటి సరఫరా బంద్

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 48 గంటలపాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 పథకంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో వాల్వ్ మార్పిడి పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ఈపనులు జరుగుతాయని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

  • బావిలో కూలిన రోడ్డు

    రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలోని నల్లలబావి వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కూలిపోయింది. ఈ రోడ్డు బావికి ఆనుకుని ఉండటంతో వర్షపు నీరు పెరిగి రోడ్డు బావిలోకి కుంగిపోయింది. ఈ ఘటనలో 11కేవీ కరెంట్ స్తంభాలు కూడా కూలిపోవడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.