రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో ఎండలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. దీంతో సాధారణం కన్నా 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, రానున్న 4రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. సెప్టెంబర్ నెల మొత్తం ఎండలు, వర్షాలు రెండూ అధికంగా ఉండే అవకాశం ఉంది.