Locations: Hyderabad

  • కబ్జాకు గురవుతున్న మేడికుంట చెరువు

    HYD: హైటెక్ సిటీలోని మాదాపూర్ మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోంది. గతంలో నీటితో కళకళలాడిన చెరువు ప్రస్తుతం అక్రమార్కుల చెరలో ఉంది. చెరువులో మట్టిని నింపి భారీ షెడ్లు, కారు మెకానిక్ షాపులు, టీ కొట్లు, పాన్ షాపులు వెలిశాయి. చెరువును కాపాడడానికి అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా ఆక్రమణదారులు దానిని తొలగించి కబ్జా చేస్తున్నారు. దీనిపై స్థానికులు హెచ్ఎండిఎకు ఫిర్యాదు చేశారు.

     

  • 17 ఏళ్లుగా లడ్డూను సొంతం చేసుకుంటున్న భక్తుడు

    HYD: హెచ్‌ఎఫ్‌నగర్ ఫేజ్ 1 బస్తీకి చెందిన మునేశ్వర్ అనే భక్తుడు 17 సంవత్సరాలుగా వేలం పాటల్లో లడ్డూను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాల్లో మండపం వద్ద నిర్వహించిన వేలంలో రూ. 2.10లక్షలు వెచ్చించి లడ్డూను కైవసం చేసుకున్నాడు. మొదటిసారిగా రూ.600కు కొనుగోలు చేసిన మునేశ్వర్, తర్వాత వరుసగా పదహారు సంవత్సరాలు లడ్డూనుసొంతం చేసుకుంటున్నాడు.

  • 1,100 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు..

    HYD: గణేష్ నిమజ్జనం తర్వాత రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు 800 మంది పారిశుద్ధ్య కార్మికులను మూడు షిఫ్టుల్లో పనిచేయిస్తూ, 18 వాహనాలు, 3 జేసీబీలతో 1100 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ముఖ్యంగా ఎంజే మార్కెట్‌ నుంచి లిబర్టీ వరకు పెద్ద ఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను క్లీనింగ్ చేసి, అన్నప్రసాదాల వ్యర్థాలను నీటితో శుభ్రం చేశారు.

  • అక్షరాస్యతలో హైదరాబాద్‌ అగ్రస్థానం

    HYD: అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా, 2011 గణాంకాల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యతలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. 83.25%తో హైదరాబాద్‌ తొలి స్థానంలో ఉండగా, మేడ్చల్‌ మల్కాజిగిరి (82.49%), హనుమకొండ (74.13%), రంగారెడ్డి (71.88%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, వికారాబాద్‌ జిల్లా 57.91%తో వెనుకబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

     

  • ఊరికి వెళ్లి వచ్చేసరికి మూడు ఇండ్లలో చోరీ..

    మేడ్చల్: బోడుప్పల్ అంబేద్కర్ నగర్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న తల్లీకొడుకును స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఊరుకు వెళ్లి తిరగి వచ్చే లోపు మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.  అనుమానస్పదంగా సంచరిస్తున్నదుర్గేష్‌ నిలదీయగా నిజం బయటపడింది. అతని వద్ద నుంచి 2తులాల బంగారం,వెండి, ల్యాప్‌టాప్‌, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి తల్లితో పాటు మరో ముగ్గురు సహకరించినట్లు స్థానికులు చెబుతున్నారు.

  • గుప్త నిధుల తవ్వకాలు.. ఐదుగురు అరెస్ట్

    వికారాబాద్: బషీరాబాద్‌లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పాడుబడిన ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని భావించిన ఆరుగురు వ్యక్తులు, మాంత్రికుడితో కలిసి పౌర్ణమితో పాటు గ్రహణం ఉందని ఆదివారం తవ్వకాలు చేపట్టారు. పొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రధాన మాంత్రికుడు పరారవ్వగా, తవ్వకాలు జరుపుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాంత్రికుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

     

  • ‘సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’

    మేడ్చల్: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డికి కాలనీవాసులు విన్నవించారు. కాలనీలో పర్యటించి, సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధిదీపాల సమస్యలను పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా వీక్షించారు. కాలనీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

  • విద్యతో పాటు క్రీడలకు ఎంఎల్‌ఆర్‌ఐటీ ప్రోత్సాహం

    మేడ్చల్: దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాల విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. 2017 నుంచి ఇప్పటివరకు 170 మంది క్రీడాకారులకు ఉచిత ప్రవేశాలు కల్పించింది. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో క్రీడాకోటా కింద ఉచిత సీట్లు కేటాయిస్తూ రికార్డు సృష్టిస్తోంది. ఈ ప్రోత్సాహంతో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూనే బీటెక్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు పూర్తిచేయగలుగుతున్నారు.

  • రూ.11కోట్ల విలువైన కెమికల్ డ్రగ్స్‌.. మహారాష్ట్రకు తరలింపు

    మేడ్చల్: చర్లపల్లిలో ఇటీవల బయటపడ్డ డ్రగ్స్ తయారీ యూనిట్‌కు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాగ్దేవి లాబరేటరీలో సీజ్ చేసిన సుమారు రూ.11కోట్ల విలువైన కెమికల్ డ్రగ్స్‌ను లారీలో మహారాష్ట్రకు తరలించారు. సుమారు 30 వేల లీటర్ల కెమికల్ డ్రమ్ములను పంచనామా పూర్తి చేసి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

  • HYDలో పెరిగిన కాలుష్యం

    గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 83 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, వాటిలో 15% (1.2 లక్షలు) పదిహేనేళ్లకు పైబడినవే. ఈ కాలం చెల్లిన వాహనాల వల్ల పీఎం 2.5 ఉద్గారాలు అధికంగా వెలువడుతున్నాయి. గ్రేటర్‌లో 350 కాలుష్య తనిఖీ కేంద్రాలున్నా, చాలా చోట్ల వాహనాలను తనిఖీ చేయకుండానే డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తున్నారని తెలుస్తోంది. అర్బన్‌ ఎమిషన్స్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం.. ఏటా 8,250 టన్నుల పీఎం 2.5 ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.