Locations: Hyderabad

  • గణేశ్‌ నిమజ్జనం.. జలాశయాల్లో పెరిగిన కాలుష్యం

    HYD: గణేశ్‌ నిమజ్జనం తర్వాత పీవోపీ విగ్రహాల వల్ల జలాశయాల్లో కాలుష్యం పెరిగిందని పీసీబీ నిపుణులు తెలిపారు. టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, రసాయనాలు నీటిలో కలిశాయని చెప్పారు. దీనిపై ఇప్పటికే మూడు దశల్లో నీటి నమూనాలను సేకరించిన అధికారులు త్వరలో కాలుష్యంపై పూర్తి నివేదికను విడుదల చేయనున్నారు. ఈ కాలుష్యం జలచరాలకు, పర్యావరణానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.

  • ఘనంగా గణపతి నిమజ్జన మహోత్సవాలు..

    HYD: మహానగరంలో గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్‌తో పాటు 100కి పైగా జలాశయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో వేడుక ప్రశాంతంగా సాగింది. 40 గంటల పాటు అప్రమత్తంగా బందోబస్తు నిర్వహించిన పోలీసులను నగర సీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు. మొత్తం ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగియడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

  • మాదాపూర్ ఎస్సీ వెల్ఫేర్ లడ్డు వేలం!

    HYD: మాదాపూర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వినాయకుడి లడ్డూకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడగా ఈరన్ సాయి కుమార్  లడ్డూ ప్రసాదాన్నిరూ.5లక్షల 15వేలకు సొంతం చేసుకున్నారు. మరోవైపు దేవుడి కలశం రికార్డ్ స్థాయి ధర పలికింది. లక్ష 20 వేలకు ఈరన్ జ్ఞానేశ్వర్ దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

  • మోడీకి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు

    HYD: చంద్రాయణగుట్ట అసెంబ్లీలోని రియాసత్ నగర్ డివిజన్ బీజేపీ నాయకులు, జీఎస్టీ తగ్గిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేశారు. దేశాభివృద్ధి నరేంద్ర మోడీతోనే సాధ్యమని, జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఊరట కలుగుతుందని వారు తెలిపారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

  • ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

    HYD: కిషన్ బాగ్ డివిజన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ పరిశీలించారు. పేద ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిబిరంలో అన్ని వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హుస్సెనీ పాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • లంగర్ హౌస్ లో ఘోర రోడ్డు ప్రమాదం

    హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్న డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో కారులో ఉన్న కశ్వి (20)  యువతి మృతిచెందగా, మరో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది.

  • ‘మల్లికార్జున కాలనీ అభివృద్ది కమిటీ ఎంపిక’

    రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో గల మల్లికార్జున కాలనీ వాసులు ఆదివారం నూతన కాలనీ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగే  కమిటీకి బర్మలి జంగయ్య అధ్యక్షుడిగా, మంచన్ పల్లి రమేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, ఆగిరు శ్రీనివాస్, పురుషోత్తం గౌరవ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

     

  • బాలానగర్‌లో 3 లక్షల కొకైన్‌ స్వాధీనం

    HYD: బాలానగర్ వై జంక్షన్ వద్ద డ్రగ్స్ విక్రయాలపై అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.  సంతోష్ యాదవ్ (43) అనే వ్యక్తి నుంచి 23.98 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు గతంలోనూ కొకైన్‌తో పట్టుబడ్డాడు. ఈ కేసులో పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

     

  • బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఆహ్వానం

    వికారాబాద్: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన అధికార నివాసంలో కలిశారు. అక్టోబర్ 3న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించారు.  ఆహ్వానాన్ని స్పీకర్ గారు స్వీకరించి, కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు.  సందర్భంగా దత్తాత్రేయ  స్పీకర్‌తో పలు విషయాలపై చర్చించారు.

  • ఆర్కే పురంలో గణేష్ లడ్డూ వేలం

    రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కే పురం డివిజన్‌లోని వాసవి కాలనీలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేలంలో రాజేంద్రప్రసాద్, కళ్యాణి దంపతులు రూ. 5,22,000కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిమజ్జన కమిటీ చైర్మన్ చిలుక ఉపేందర్ రెడ్డి వారిని సత్కరించారు.