Locations: Hyderabad

  • ‘బాలుడిపై వీధి కుక్కల దాడి’

    మేడ్చల్: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట గ్రామంలో వీధి కుక్కలు రెండేళ్ల బాలుడు భవిష్‌పై దాడి చేశాయి. ఆరుబయట ఆడుకుంటున్న బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడిని చికిత్స కోసం సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడద గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     

  • మాదాపూర్‌లో ఘనంగా లడ్డూ వేలం

    HYD: మాదాపూర్‌ గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది లడ్డూ వేలంలో గోదా శ్రీనివాస్ యాదవ్ రూ. 75 వేలకు దక్కించుకున్నారు. నవరాత్రుల పూజల అనంతరం గణనాథుని నిమజ్జనానికి సిద్ధం చేశారు. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలివస్తుండడంతో, ఆ ప్రాంతం భక్తులతో కిక్కిరిసింది.

     

  • ‘చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు’

    HYD: చర్లపల్లిలోని వాగ్దేవీ ల్యాబొరేటరీస్‌పై పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడింది. ముంబైలో బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెల రోజులపాటు కూలీల వేషంలో నిఘాపెట్టిన పోలీసులు, కోట్లు విలువచేసే డ్రగ్స్‌ను, 35,500 లీటర్ల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. 5.79 కిలోల మెఫిడ్రోన్, 950 కిలోల పొడిపదార్థాన్ని సీజ్ చేశారు. ముంబై పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా ల్యాబొరేటరీస్‌లో చేరి ఆధారాలు సేకరించారు.

  • కొడంగల్‌ వెంకటేశ్వర ఆలయం మూసివేత

    వికారాబాద్: కొడంగల్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఆదివారం సాయంత్రం 3:30 నుంచి ఆలయ తలుపులు మూసి ఉంటాయని, సోమవారం ఉదయం 5 గంటలకు తిరిగి తెరిచి ఆలయాన్ని శుద్ధి చేస్తారని ధర్మకర్తలు తెలిపారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.

     

  • ఊరేగింపులో అపశృతి: గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

    మేడ్చల్: వినాయకుడి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందారు. ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె.డేవిడ్‌(31) అనే కానిస్టేబుల్‌ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున వినాయకుడి ఊరేగింపులో పాల్గొన్న ఆయన..  నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తలిరంచారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

  • చిలుకూరు బాలాజీ ఆలయం తాత్కాలిక మూసివేత

    రంగారెడ్డి: ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని చంద్రగ్రహణం కారణంగా  సాయంత్రం 4 గంటల నుంచి మూసివేశారు. ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రహణం అనంతరం ఆలయ సంప్రోక్షణ, అభిషేకాల తర్వాత సోమవారం ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. భక్తులు సోమవారం ఉదయం 8 గంటల తర్వాత దర్శనానికి రావాలని ఆయన సూచించారు. ఈ తాత్కాలిక మూసివేతపై భక్తులు గమనించాలని కోరారు.

  • ‘స్క్రాప్ షెడ్డులో భారీ అగ్నిప్రమాదం’

    రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలోని టాటానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక స్క్రాప్ షెడ్డులో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

  • కొత్తూరు బిఆర్ఎస్ నాయకులపై అట్రాసిటీ కేసు

    రంగారెడ్డి: షాద్ నగర్ నియోజకవర్గ కొత్తూరు మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన గొడవలపై అల్లరి మూకలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు కర్రోళ్ల సురేందర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్తూరు పోలీసులు ఆదివారం దాడి, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. కొత్తూరు మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వేడుకలు జరిగిన ప్రతిసారి అల్లర్లు సృష్టిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

  • 1,40,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి: సీవీ ఆనంద్

    HYD: కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..‘ సాయంత్రం వరకు 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంటుంది. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం నిమజ్జనం త్వరగా చేపట్టడంతో మిగతా గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాం. హైదరాబాదులో ఎక్కువ గణేష్ విగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉన్నాయి.  గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు ప్రశాంతంగా కొనసాగడానికి GHMC సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు బాగా సహకరించారు.

  • ‘బషీరాబాద్‌లో గుప్త నిధుల తవ్వకాల కలకలం’

    వికారాబాద్: బషీరాబాద్ మండల కేంద్రంలోని ఓ పురాతన భవనంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ కుమార్, మహేష్ కుమార్, శివకుమార్, పట్నం శ్రీనివాస్, ఎండి ఖాజా అనే వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.