మేడ్చల్: నాగారం మున్సిపాలిటీలోని ఇందిరా ప్రియదర్శిని వికర్ సెక్షన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. కాలనీలో సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
మోకిలలో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్
రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం, మోకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-2025కు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మరక్షణకు, మానసిక ధైర్యానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
-
రేవంత్ రెడ్డి చేతుల మీదగా లోగో ఆవిష్కరణ
రంగారెడ్డి: గండిపేట మండలం, గోల్కొండ రిసార్ట్స్ వద్ద గోదావరి నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో నింపేందుకు అధికారులు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. రూ. 7,360 కోట్లతో గోదావరి నుంచి ఫేజ్ 2, 3 కింద నీటిని తరలించి మూసీ నదిని పునరుజ్జీవింపజేయనున్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు లోగో ఆవిష్కరణ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
-
యాలాల మండలం రాస్నంలో దంపతుల ఆత్మహత్య
వికారాబాద్: యాలాల మండలం రాస్నం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా శ్రీనివాస్ రెడ్డి (68) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య భాగ్యమ్మ (60) కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
‘చేవెళ్లలో మెగా లోక్ అదాలత్’
రంగారెడ్డి: చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8 నుంచి 13 వరకు మెగా లోక్ అదాలత్ జరగనుంది. డ్రంకెన్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసులు తక్కువ జరిమానాతో పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం లేదా కోర్ట్ కానిస్టేబుల్ జంగయ్యను సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
రాష్ట్ర బీజేపీ చీఫ్‌కు బాలాపూర్ లడ్డూ ప్రసాదం
HYD: బాలాపూర్ గణేశ్ లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్న కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావును కలిశారు. తార్నాకలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని రాంచందర్ రావుకు అందజేశారు.
-
ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
మేడ్చల్: జీఎస్టీలో 12, 28 శాతం స్లాబులను పూర్తిగా ఎత్తివేయడం, ఆరోగ్య రంగ మందులపై పన్ను తొలగించడం పట్ల నాగారం మాజీ మున్సిపల్ ఛైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ఎంతో మేలు చేశారని కొనియాడుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
-
యాలాలలో భార్యాభర్తల ఆత్మహత్య
వికారాబాద్: యాలాల మండలం రాస్నం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మంచన్‌పల్లి శ్రీనివాస్ రెడ్డి (63) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆయన భార్య భాగ్యమ్మ (58) గ్రామం పక్కన ఉన్న కాలువలో దూకి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
హుస్సేన్‌సాగర్ చుట్టూ రాకపోకలు పునరుద్ధరణ
HYD: గణేశ్ నిమజ్జనాలు తుదిదశకు చేరాయి. దీంతో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సడలించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ రాకపోకలను పునరుద్ధరించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, బషీర్‌బాగ్, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గాల్లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. రహదారులపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.
-
నిమజ్జనం చెత్త తొలగింపు ప్రారంభించిన జీహెచ్ఎంసీ
HYD: అల్వాల్ కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జన వ్యర్థాల తొలగింపు పనులను జీహెచ్‌ఎంసీ శానిటేషన్ అధికారులు ప్రారంభించారు. ఈ కొలనులో ఇప్పటివరకు 15 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని అధికారులు తెలిపారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లుతున్నామని శానిటేషన్ సూపర్వైజర్ ప్రభాకర్ తెలిపారు.