హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మొత్తం 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగిందని, ఇంకా 900 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది విగ్రహాల ఎత్తు పెరగడం వల్ల ఊరేగింపు ఆలస్యమైందని చెప్పారు. బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.