హైదరాబాద్ పాతబస్తీలో గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. చార్మినార్ వరకు సాగిన ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆనందోత్సవాలతో నిమజ్జనంలో పాల్గొన్నారు. పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, శోభాయాత్ర సజావుగా సాగేలా పర్యవేక్షించారు.
Locations: Hyderabad
-
నిమజ్జన వేడుకల్లో అపశృతి.. GHMC కార్మికురాలు మృతి
HYD: బషీర్‌బాగ్ వద్ద జరిగిన ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక మృతి చెందింది. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక ఆదివారం ఉదయం విధులు నిర్వహించే క్రమంలో రోడ్డు దాటుతుండగా టస్కర్ వాహనం ఆమె పైనుంచి వెళ్లింది. తలకు తీవ్ర గాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సైఫాబాద్ పోలీసులు టస్కర్ డ్రైవర్ గజానంద్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
-
గణపతి మండపం వద్ద మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో తలసేమియాతో బాధపడుతున్న బాలుడు విపిన్‌పాల్ ప్రాణాన్ని కాపాడేందుకు స్థానికులు ముందుకు వచ్చారు. గణేశ్ మండపం లడ్డూ వేలంలో అతని పరిస్థితిని వివరించడంతో.. గ్రామస్తులు, వ్యాపారవేత్తలు స్పందించి సుమారు 7లక్షల రూపాయలు పోగుచేసి తండ్రికి అందజేశారు. బాలుడి వైద్యానికి మొత్తం రూ.22 లక్షలు అవసరం కాగా.. పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత సహాయం అందింది.
-
కలిసొచ్చిన వినాయక నిమజ్జనం.. రూ.99కే ఎలక్ట్రిక్ బైక్
మేడ్చల్: దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని అంజనాద్రి నగర్ గణేశ్ ఉత్సవ కమిటీ లక్కీడ్రాలో జలగం అనిల్ రూ.99కే ఎలక్ట్రిక్ బైక్‌ను గెలుచుకున్నాడు. లడ్డూ వేలానికి బదులుగా, రూ.99 లక్కీ డ్రా టికెట్ పద్ధతిలో ఈ బైక్‌ను అందించాలని కమిటీ నిర్ణయించింది. మొత్తం 425 మంది ఈ డ్రాలో పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ వసుపతి రమేష్ గౌడ్ చేతుల మీదుగా అనిల్‌కు బైక్‌ను అందజేశారు.
-
హకీంపేట డిపో నుంచి కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం
మేడ్చల్: ఈ నెల 8వ తేదీ నుంచి హకీంపేట బస్సు డిపో నుంచి నాలుగు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ భవభూతి తెలిపారు. మేడ్చల్ నుంచి ఈసీఐఎల్ వరకు 22E/229 నెంబర్‌తో ఈ బస్సులు నడుస్తాయి. ఈరూట్‌లో ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సర్వీసులు నడుస్తాయని తెలిపారు.
-
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే రోజు ఆరు ప్రసవాలు.. ఆరుగురు మగ పిల్లలే
మేడ్చల్: మల్కాజిగిరిలోని రెండు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో అరుదైన సంఘటన జరిగింది. 24 గంటల వ్యవధిలో ఆరు ప్రసవాలు జరగ్గా, జన్మించిన ఆరుగురు శిశువులు మగ పిల్లలే కావడం విశేషం. అంతేకాకుండా.. ఈ ప్రసవాలన్నీ సాధారణ పద్ధతిలో జరిగాయి. ఇది ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. ప్రస్తుతం తల్లులు, నవజాత శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.
-
కొనసాగుతున్న నిమజ్జనం.. బారులు తీరిన జనం
హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 2,61,333 గణేశ్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 35,994, చార్మినార్ 22,304, ఖైరతాబాద్ 63,019, శేరిలింగంపల్లి 41,360, కూకట్ పల్లి 62,405, సికింద్రాబాద్ పరిధిలో 36,251 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీంతో ఎల్బీనగర్ వద్ద మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు కిక్కిరిసి కనిపించారు.
-
ట్యాంక్ బండ్ ఫుల్.. రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనం
హైదరాబాద్‌లో రెండో రోజు కూడా గణేశ్ నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ వైపుగా వేలాది విగ్రహాలు క్యూ కట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 2.61 లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్క హుస్సేన్‌సాగర్‌లోనే 11 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
-
హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలు
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో అనుమతులు లేకుండానే అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. స్థలాల ధరలు పెరగడంతో, శంషాబాద్, నార్సింగి, కోకాపేట వంటి ప్రాంతాలలో 40-60 గజాల్లోనే ఆరేడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. గతంలో 600 అక్రమ భవనాలను గుర్తించిన అధికారులు, 250 భవనాలను పాక్షికంగా కూల్చివేశారు. అయినా కూడా కొన్నాళ్లకే మళ్లీ నిర్మాణాలు మొదలుపెట్టారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
-
పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గతవారం విజయవాడ, గుంటూరులో రూ.220 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర ఇప్పుడు రూ.240కి చేరింది. హైదరాబాద్, కామారెడ్డిలలో కేజీ చికెన్ రూ.240గా ఉంది. వినాయక నిమజ్జనాలు ముగియడం, ఆదివారం కావడంతో చికెన్ అమ్మకాలు పెరగడంతో ఈ ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. ఈ ధరలు వచ్చేవారం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.