మేడ్చల్: రామంతపూర్‌లోని విశాల్ షాపింగ్ మాల్ వద్ద వైశ్య సంక్షేమ సంఘం గణపతి నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపునకు స్వాగతం పలికింది. ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్న గణనాథులను తమ వేదిక వద్దకు ఆహ్వానించి, మండపాల నిర్వాహకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికుల ప్రశంసలు పొందింది.
Locations: Hyderabad
-
గంగమ్మ ఒడికి చేరిన బాలాపూర్ గణేశుడు
HYD:బాలాపూర్ గణేశుడు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యాడు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, ప్రజల కోలాహలం మధ్య గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భారీ గణేశుడి విగ్రహం నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజలు, సంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాలాపూర్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు.
-
గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక రైళ్లు
HYD: గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఎంఎంటిఎస్ రైళ్లను నడపనుంది. నేటి రాత్రి 10 గంటల నుండి రేపు ఉదయం 4 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడంలో సహాయపడతాయని వెల్లడించారు.
-
గణపతి ఊరేగింపునకు గౌడ సంఘం స్వాగతం
మేడ్చల్: రామంతపూర్‌లోని విశాల్ షాపింగ్ మాల్ వద్ద గౌడ సంక్షేమ సంఘం, గణపతి నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపునకు స్వాగతం పలికింది. ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న గణనాథులను తమ వేదిక వద్దకు ఆహ్వానించి, నిర్వాహకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
-
రామంతపూర్‌లో గణపతి లడ్డు రికార్డు ధర
మేడ్చల్: రామంతపూర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డు రూ. 6,66,000లకు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. స్థానిక కాంట్రాక్టర్ జంధ్యాల శ్రీనివాస్ శనివారం జరిగిన వేలంలో లడ్డును కైవసం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు వెంకట్ రావు, కమిటీ సభ్యులు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.
-
18 ఏళ్లు నిండినవారు అర్హులు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..?
TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
-
తస్మాత్ జాగ్రత్త.. హైడ్రా పేరుతో రూ.50 లక్షలు టోకరా!
హైదరాబాద్‌లో హైడ్రా అధికారుల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. కొందరు మోసగాళ్లు భూ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. ఈ మోసం హైడ్రా కమిషనర్ దృష్టికి రావడంతో వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని హైడ్రా అధికారులు సూచిస్తున్నారు.
-
యంత్రాగం అనుక్షణం అప్రమత్తత
హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఊరేగింపు సాఫీగా జరుగుతోంది. సుమారు 15 వేల మంది శానిటేషన్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భక్తుల సందడి మధ్య నిమజ్జనాలు వేగంగా జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 5 వేల మందికి ఉచిత భోజనాలు అందిస్తున్నారు.
-
బడా గణేశ్ నిమజ్జనం విజయవంతం
ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో విజయవంతంగా పూర్తయ్యింది. గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడిని చూసి భక్తులు ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అంటూ నినాదాలు చేశారు. నిమజ్జన ఘట్టాన్ని వీక్షించడానికి వేలాదిమంది జనం తరలివచ్చారు. కొంతమంది యువకులు ఈత కొడుతూ గణనాథుడి దగ్గరకు వెళ్లి తమ భక్తిని చాటుకున్నారు. ఈసందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
-
మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను పంపిణీ
వికారాబాద్: మహిళలు తమకు నచ్చిన రంగాల్లో నైపుణ్యం పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్, స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పొందిన 35 మంది మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ శిక్షణ మహిళలకు ఆర్థిక తోడ్పాటునిస్తుందని, ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను కోరారు.