Locations: Hyderabad

  • వెస్ట్‌ హైదరాబాద్‌ తప్ప అంతా ‘అందుబాటు’లోనే..

    హైదరాబాద్‌లో భూముల ధరలు పెరగడంతో సామాన్యులకు ఇల్లు కొనడం కష్టంగా మారింది. అయినా పలు నిర్మాణ సంస్థలు పశ్చిమ హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరలకు గృహాలను నిర్మిస్తున్నాయి. 700-800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే 2-BHK ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రూ.60లక్షల లోపు ధర ఉండే ఈ గృహాలు సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతున్నాయి.

  • ‘గణపతి బప్పా మోరియా’ అని నినాదాలు చేసిన సీఎం

    TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్‌సాగర్‌ వద్ద  నిమజ్జన ఏర్పాట్లను ఆకస్మికంగా పరిశీలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సామాన్యుడిలా అక్కడికి చేరుకున్న సీఎం, భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. క్రేన్ నెం.4 వద్ద నిమజ్జన ప్రక్రియను కలెక్టర్ హరిచందనతో సమీక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందిని అభినందించి, ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. భక్తులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

     

     

  • ‘అందెల రవమిది’ చిత్ర బృందం ఆలయ సందర్శన

    రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉన్న 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ‘అందెల రవమిది’ చిత్ర బృందం సందర్శించి, ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు స్వామి చేతుల మీదుగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఈనెల 19న థియేటర్లలో, దసరాకు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

  • ‘మాధవరం కృష్ణారావు వినాయక మండపాల సందర్శన’

    HYD: కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు KPHP డివిజన్లోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 9వ ఫేజ్‌లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదానం ప్రారంభించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కోఆర్డినేటర్ సతీష్ అరోరా, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • గణేష్ మండపాన్ని సందర్శించిన బండి రమేష్

    HYD: టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్ పల్లి  కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్  KPHP కాలనీలోని ఫోర్త్ ఫేస్ వెంచర్ 2 లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, వారిని అభినందించారు. కాంగ్రెస్ నాయకులు సూరిబాబు, శివ చౌదరి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

  • జనసేన వీర మహిళకు ఆర్థిక సహాయం

    HYD: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అట్లాంటా తాజ్‌కు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికుడు యడవల్లి మహారాణ తమ కుటుంబ సభ్యులు రేవు సునీల్ కుమార్, యడవల్లి మౌళిమ, రేవు ఆర్క ద్వారా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న బొండాడ మహాలక్ష్మికి చికిత్స నిమిత్తం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.  కార్యక్రమంలో  అల్లం శెట్టి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  • 333 కిలోల గణేశ్‌ లడ్డూ.. రూ.99కే దక్కించుకున్న విద్యార్థి

    హైదరాబాద్‌లోని కొత్తపేటలో నిర్వహించిన లక్కీ డ్రాలో ఒక విద్యార్థి కేవలం రూ. 99కే గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నాడు. శ్రీఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లక్కీ డ్రాలో సుమారు 760 మంది పాల్గొన్నారు. బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ విజేతగా నిలిచి, 333 కిలోల బరువైన లడ్డూను గెలుచుకున్నాడు. వేలంలో లక్షలు వెచ్చించినా దక్కని లడ్డూ, ఇక్కడ తక్కువ ధరకే రావడం విశేషం.

  • ట్యాంక్ బండ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన

    TG: హైదరాబాద్‌లో జరుగుతున్న గణేష్ నిమజ్జన ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం, ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా తన కాన్వాయ్‌తో ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. అక్కడి ఏర్పాట్లను, నిమజ్జనం తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆకస్మిక పర్యటనతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సీఎం పర్యటన సాగింది.

  • మానవత్వం చాటుకున్న కమిషనర్ సుధీర్ బాబు

    HYD: బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • రూ.2.32 కోట్ల లడ్డూ.. ఆ డబ్బుతో..

    HYD: బండ్లగూడ రిచ్‌మండ్ విలాస్‌లోని గణేష్ లడ్డూ వేలంలో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 10 కిలోల ఈలడ్డూ రూ.2.32 కోట్లు పలికింది. గతేడాది ధర కంటే రూ.45లక్షలు ఎక్కువ. ఈలడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్వీ దివ్య ఛారిటబుల్ ట్రస్టుకు అందజేస్తారు. ఈట్రస్ట్ డబ్బును 42 ఎన్జీఓల ద్వారా వృద్ధుల సంరక్షణ, మహిళల ఆరోగ్యం, విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు వినియోగించనుంది.