Locations: Hyderabad

  • ‘వచ్చే ఏడాది మళ్ళీ వస్తా’

    HYD: ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడిని నిమజ్జనం చేయడానికి వేలాదిగా ప్రజలు హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చారు. ‘వచ్చే ఏడాది మళ్ళీ వస్తా’ అని చెప్పినట్లు ఆయన చివరి చూపు అందరి హృదయాలను బరువెక్కించింది.  ఇదే సమయంలో ట్యాంక్‌బండ్ పరిసరాలు గణపతి బప్పా మోరియా! మళ్లీ రావయ్యా! అనే నినాదాలతో మారుమోగింది.

     

     

     

  • గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి యూరప్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌

    తెలుగు వారికి యూరప్ ప్రయాణం మరింత సులభతరం కానుంది. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న కేఎల్‌ఎం ఎయిర్‌లైన్స్, హైదరాబాద్‌ను తమ నాలుగో గేట్‌వేగా పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబైల నుండి విమానాలు నడుపుతున్న కేఎల్‌ఎం, హైదరాబాద్-ఆమ్‌స్టర్‌డామ్ మార్గంలో బోయింగ్ 777-200ER విమానాలను ఉపయోగించనుంది. ఈవిమాన సేవలు వ్యాపార, పర్యాటక రంగాలకు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో విమానాల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు.

  • ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర.. డ్రోన్‌ వీడియో

    HYD: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర.. రాజ్‌ధూత్‌ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు సాగింది. అందుకు సంబంధించిన డ్రోన్‌ దృశ్యాలను మీరూ చూసేయండి.

  • మరణంలోనూ వీడని బంధం.. భర్త చనిపోయిన గంటలోనే భార్య కూడా..!

    మేడ్చల్: కీసర మండలం నాగారం ప్రశాంత్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. జంబాపురం నారాయణ రెడ్డి (70) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. భర్త మరణించిన గంట వ్యవధిలోనే ఆయన భార్య ఇందిర (65) కూడా మృతి చెందారు. కలిసే జీవించిన దంపతులు కలిసే మరణించడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  • ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద స్టెప్పులేసిన పోలీసులు, లీడర్లు

    హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ బడా గణేశ్ ఇప్పటికే క్రేన్ నెం.4 వద్దకు చేరుకున్నాడు. ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకొచ్చే సమయంలో భక్తులు, పోలీసులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

     

  • గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశ్

    HYD: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు.  వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.  అంతకుముందు ఖైరతాబాద్‌ నుంచి సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.

     

     

     

  • బాలాపూర్ గణనాథుడికి సౌత్ ఈస్ట్ డీసీపీ బృందం WELCOME

    HYD: బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిని దాటి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (హెచ్‌పీసీ) పరిధిలోకి ప్రవేశించింది. బాలాపూర్ గణనాథుడికి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన బృందంతో కలిసి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ శోభాయాత్ర పాతబస్తీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు కదులుతోంది. భక్తులు డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఉత్సవాల్లో పాల్గొంటూ గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు.

     

  • HYDలో రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

    హైదరాబాద్ శివారులోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీలో తయారవుతున్న భారీ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి రూ. 12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్(ఎండీ) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఓ విదేశీయుడితో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.

  • బోయిన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

    HYD: బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని డెయిరీ ఫార్మ్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలు లభ్యమైనట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

  • బుడ్డోడు భక్తితో ‘గణపయ్యను కట్టేశాడు’

    హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో ఐదేళ్ల బాలుడు చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. తాను ఆడుకునే చిన్న బైక్‌పై చిన్న గణపతి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌కు తీసుకువచ్చాడు. ఈ బాలుడి భక్తిని చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయి, అతడితో ఫొటోలు దిగారు. ‘గణపయ్యను భక్తితో కట్టేశావ్’ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.