Locations: Hyderabad

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: డీజీపీ జితేందర్

    TG: రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ నిమజ్జనం పూర్తి కాగా, బాలాపూర్ గణపతి శోభాయాత్రగా తరలివెళ్తున్నాడు. భద్రత కోసం ఇతర జిల్లాల నుంచి 8 వేల మంది బలగాలను మోహరించామని, ఏరియల్ సర్వే ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ, నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. బంజారాహిల్స్ ఐసీసీసీ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

  • తాండూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

    వికారాబాద్: తాండూరులోని బాలాజీ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. మాజీ మండల విద్యాధికారి శేరి సుధాకర్ రెడ్డి, మృత్యుంజయ స్వామి, మాధురి, మోగులయ్య, పాండప్ప, సరితలను ఘనంగా సత్కరించారు. అలాగే ఉత్తమ విద్యార్థులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని వక్తలు కొనియాడారు.

  • కన్నుల పండుగగా నిమజ్జనం శోభయాత్ర

    వికారాబాద్: బషీరాబాద్ మండలం నవల్గి గ్రామంలోని మారుతి భజన మండలి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు భగవద్గీత, ఓంకారం, పూజ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 11 రోజుల పాటు వినాయకుడిని ప్రతిష్టించి, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి భజనలతో ఊరేగింపుగా వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ విశ్వనాథం, అనిల్, వివేక్, మారుతి భజన మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • 170 ట్రైనీ ఐపీఎస్ అధికారులకు సీ.వి. ఆనంద్ క్లాస్

    హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ సీ.వి. ఆనంద్  తన 10 సంవత్సరాల హైదరాబాద్ అనుభవాలను పంచుకున్నారు. 25,000 విగ్రహాల నిమజ్జనం చివరి రోజున ఉంటుందని అంచనా వేశాారు. గణేష్ ఉత్సవాల బందోబస్తు నిర్వహణలో పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలను వివరించారు.  రామ్ నివాస్ సేపట్, కల్మేశ్వర్ సింగేన్వార్ తదితరులు పాల్గొన్నారు.

  • ‘వచ్చే ఏడాది మళ్ళీ వస్తా’

    HYD: ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడిని నిమజ్జనం చేయడానికి వేలాదిగా ప్రజలు హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చారు. ‘వచ్చే ఏడాది మళ్ళీ వస్తా’ అని చెప్పినట్లు ఆయన చివరి చూపు అందరి హృదయాలను బరువెక్కించింది.  ఇదే సమయంలో ట్యాంక్‌బండ్ పరిసరాలు గణపతి బప్పా మోరియా! మళ్లీ రావయ్యా! అనే నినాదాలతో మారుమోగింది.

     

     

     

  • గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి యూరప్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌

    తెలుగు వారికి యూరప్ ప్రయాణం మరింత సులభతరం కానుంది. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న కేఎల్‌ఎం ఎయిర్‌లైన్స్, హైదరాబాద్‌ను తమ నాలుగో గేట్‌వేగా పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబైల నుండి విమానాలు నడుపుతున్న కేఎల్‌ఎం, హైదరాబాద్-ఆమ్‌స్టర్‌డామ్ మార్గంలో బోయింగ్ 777-200ER విమానాలను ఉపయోగించనుంది. ఈవిమాన సేవలు వ్యాపార, పర్యాటక రంగాలకు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో విమానాల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు.

  • ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర.. డ్రోన్‌ వీడియో

    HYD: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర.. రాజ్‌ధూత్‌ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు సాగింది. అందుకు సంబంధించిన డ్రోన్‌ దృశ్యాలను మీరూ చూసేయండి.

  • మరణంలోనూ వీడని బంధం.. భర్త చనిపోయిన గంటలోనే భార్య కూడా..!

    మేడ్చల్: కీసర మండలం నాగారం ప్రశాంత్ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. జంబాపురం నారాయణ రెడ్డి (70) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. భర్త మరణించిన గంట వ్యవధిలోనే ఆయన భార్య ఇందిర (65) కూడా మృతి చెందారు. కలిసే జీవించిన దంపతులు కలిసే మరణించడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  • ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద స్టెప్పులేసిన పోలీసులు, లీడర్లు

    హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ బడా గణేశ్ ఇప్పటికే క్రేన్ నెం.4 వద్దకు చేరుకున్నాడు. ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకొచ్చే సమయంలో భక్తులు, పోలీసులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

     

  • గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశ్

    HYD: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు.  వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.  అంతకుముందు ఖైరతాబాద్‌ నుంచి సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.