Locations: Hyderabad

  • బాలాపూర్ గణనాథుడికి సౌత్ ఈస్ట్ డీసీపీ బృందం WELCOME

    HYD: బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిని దాటి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (హెచ్‌పీసీ) పరిధిలోకి ప్రవేశించింది. బాలాపూర్ గణనాథుడికి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన బృందంతో కలిసి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ శోభాయాత్ర పాతబస్తీ మీదుగా ట్యాంక్‌బండ్‌కు కదులుతోంది. భక్తులు డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఉత్సవాల్లో పాల్గొంటూ గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు.

     

  • HYDలో రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

    హైదరాబాద్ శివారులోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీలో తయారవుతున్న భారీ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి రూ. 12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్(ఎండీ) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఓ విదేశీయుడితో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.

  • బోయిన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

    HYD: బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని డెయిరీ ఫార్మ్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలు లభ్యమైనట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

  • బుడ్డోడు భక్తితో ‘గణపయ్యను కట్టేశాడు’

    హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో ఐదేళ్ల బాలుడు చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. తాను ఆడుకునే చిన్న బైక్‌పై చిన్న గణపతి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌కు తీసుకువచ్చాడు. ఈ బాలుడి భక్తిని చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయి, అతడితో ఫొటోలు దిగారు. ‘గణపయ్యను భక్తితో కట్టేశావ్’ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

     

  • పండగ రద్దీ.. ప్రణాళిక పకడ్బందీ

    HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి, పండగ సీజన్ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా 1.3 లక్షల మంది ప్రయాణించే స్టేషన్‌లో పండగలకు 2 లక్షలకు పైగా రద్దీ ఉంటుందని అంచనా. ఈద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని రైళ్లను సనత్‌నగర్, చర్లపల్లి వంటి స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు. ప్రయాణికుల కోసం ప్లాట్‌ఫారాలపై వేచిఉండే ప్రాంతాలు కూడా ఏర్పాటు చేశారు.

  • బొజ్జగణపయ్యా.. వెళ్లిరావయ్యా

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నగరంతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన గణనాథులను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ వేడుకల సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. భక్తులు సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుళ్లతో గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. శోభాయాత్రలో యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటూ సందడి వాతావరణం నెలకొల్పారు.

  • సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ రఘురాం కన్నుమూత

    HYD: సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌జోన్‌ చాంద్రాయణగుట్ట, హైదరాబాద్‌ డీఐజీ ఎం.రఘురాం శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. చాంద్రాయణగుట్ట గ్రూప్‌సెంటర్‌లోని ఏడీజీ కార్యాలయంలో డీజీపీ హోదాలో ఉన్న ఆయన భౌతికకాయాన్ని గ్రూప్‌సెంటర్‌కు తీసుకొచ్చారు. ఏడీజీ ఆప్‌.పి.సింగ్, డీఐజీపీ ఉదయభాస్కర్‌ బిల్లా, సెకండ్‌ సిగ్నల్‌ కమాండెంట్‌ హరిఓం భౌతికకాయానికి నివాళులర్పించారు.

  • నకిలీ వైద్యుల పరుగో పరుగు

    హైదరాబాద్‌లోని కాటేదాన్, శివరాంపల్లి, బాలాపూర్‌లలో అనుమతి లేని క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నకిలీ వైద్యులు గురురాజ్ గురుపాద్, డాక్టర్ శరణ్ అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు తేలింది. మరో ముగ్గురు నకిలీ వైద్యులు పారిపోయారు. ఈ నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అర్హత లేని వైద్యుల గురించి 91543 82727 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.

  • డేటా సెంటర్ల హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌

    హైదరాబాద్ రాబోయే ఐదేళ్లలో డేటా హబ్‌గా మారనుంది. తక్కువ ఖర్చు, ఐటీ నైపుణ్యం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ నగరం డేటా సెంటర్లకు ఆకర్షణీయంగా మారింది. వచ్చే ఐదేళ్లలో 55 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్ టెక్నీషియన్, డేటా ఇంజినీర్ వంటి ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

  • మేడ్చల్- అత్వెల్లి రోడ్డుపై వాహనం బ్రేక్ డౌన్..

    మేడ్చల్ బస్టాప్ సమీపంలోని 7 టెంపుల్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఒక లారీ ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మేడ్చల్ నుంచి అల్వెల్లి, తూప్రాన్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, లారీని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.