HYD: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు ఖైరతాబాద్ నుంచి సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.