HYD: బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాట మరోసారి కొత్త రికార్డు సృష్టించింది. లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో మొత్తం 38 మంది పాల్గొనగా, గట్టి పోటీ మధ్య దశరథ్ గౌడ్ అత్యధిక ధర వెచ్చించారు. ఈసారి దశరథ్ గౌడ్ లైవ్‌లోనే డబ్బులు చెల్లించడం విశేషం.
Locations: Hyderabad
-
మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం
HYD: ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తుల మధ్య మహాగణపతి ఊరేగింపు అట్టహాసంగా కొనసాగుతోంది. రాజ్‌ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ఈ యాత్ర ట్యాంక్ బండ్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో పాల్గొనడానికి ట్యాంక్‌బండ్ రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
-
రేపు రాత్రి 11 గంటల వరకు వాటికి నో ఎంట్రీ!
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. రేపు రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు అనుమతి లేదు. మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ వరకు ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. ఇతర రాష్ట్రాల, జిల్లాల బస్సులు చాదర్‌ఘాట్ వరకు మాత్రమే రాగలవు. భక్తుల సౌకర్యార్థం మెట్రో రైలు సర్వీసులను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించారు.
-
మోజంజాహీ మార్కెట్ వద్ద గణేష్ శోభాయాత్ర
HYD: గణేష్ నిమజ్జనం శోభాయాత్ర మోజంజాహీ మార్కెట్ వద్ద నెమ్మదిగా సాగుతోంది. గణనాథులు ఒక్కొక్కరుగా మోజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. మార్కెట్ వద్ద భక్తుల సందడి, జనసందోహం భారీగా ఉంది. పోలీసులు నిమజ్జనానికి ఆటంకం లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల నినాదాలు, కోలాహలం మధ్య గణేశులు ముందుకు సాగుతున్నారు.
-
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
HYD: బంగారం ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 పెరిగి రూ.1,08,490కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.99,450గా పలుకుతోంది. ఇటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి మొదటి సారి రూ.1,38,000కు చేరుకుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే దరలు కొనసాగుతున్నాయి.
-
బాలాపూర్ గణేశుడి లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం: దశరథగౌడ్
HYD: ప్రతిష్ఠాత్మక బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ అంటే ఎంతో ఇష్టమని దశరథ గౌడ్ తెలిపారు. దీని కోసం ఆరేళ్లుగా ప్రయత్నిస్తే నేడు దక్కిందని వివరించారు.
-
బాలాపూర్ లడ్డూ వెయిట్ ఎంతంటే
HYD: బాలాపూర్ లడ్డూను కేవలం 21 కేజీలతో మాత్రమే తయారు చేస్తారు. 21 అనే సంఖ్యను చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఇది ప్రధానంగా సంపద, విజయం, అదృష్టానికి సూచికగా పరిగణిస్తారు. ఈ రెండు అంకెలను కలిపితే మూడు వస్తుంది. సంఖ్యా శాస్త్రంలో 3వ అంకె గురువు (బృహస్పతి) గ్రహాన్ని సూచిస్తుంది. ఇది జ్ఞానం, సంపద, శ్రేయస్సుకు కారకంగా భావిస్తారు. దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.
-
బాలాపూర్ లడ్డూ గ్రహీతకు గుర్తుండిపోయే కానుక
HYD: గత ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో రికార్డు సృష్టించిన కొలను శంకర్ రెడ్డిని బాలాపూర్ ఉత్సవ సమితి సత్కరించింది. ఆయన రూ.30,01,000కు బంగారు లడ్డూను దక్కించుకుని, ఆ మొత్తాన్ని ఉత్సవ సమితికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఘనతను గుర్తించిన సమితి అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి బంగారు గొలుసును బహుకరించి సన్మానించారు. రికార్డు బాలాపూర్ లడ్డూ వేలం చరిత్రలో ఒక విశేషంగా నిలిచిపోయింది.
-
బాలాపూర్ లడ్డూ గెలిచినవారికి..!
HYD: బాలాపూర్ లడ్డూను వేలంలో గెలుచుకున్నవారికి అదృష్టం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ వేలం పాటలో వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు, దేవాలయాల నిర్వహణకు ఉపయోగిస్తారు. లడ్డూను వేలంలో గెలుచుకున్న వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇది వారి దాతృత్వాన్ని, భక్తిని చాటుకోవడానికి ఒక మార్గంగా భావిస్తారు.
-
బాలాపూర్ గణేశ్ లడ్డూ@ రూ.35 లక్షలు
HYD: అందరు ఊహించినట్టే బాలాపూర్ లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికింది. రూ. 35 లక్షలకు లింగాల దశరథగౌడ్ సొంతం చేసుకున్నారు. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది ఈ లడ్డూను 30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి 4 లక్షల 99 వేలు అధికంగా పలికి రికార్డు సృష్టించింది.