Locations: Hyderabad

  • బాలాపూర్ లడ్డూ గెలిచినవారికి..!

    HYD: బాలాపూర్ లడ్డూను వేలంలో గెలుచుకున్నవారికి అదృష్టం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ వేలం పాటలో వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు, దేవాలయాల నిర్వహణకు ఉపయోగిస్తారు. లడ్డూను వేలంలో గెలుచుకున్న వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇది వారి దాతృత్వాన్ని, భక్తిని చాటుకోవడానికి ఒక మార్గంగా భావిస్తారు.

     

  • బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ@ రూ.35 లక్షలు

    HYD: అందరు ఊహించినట్టే బాలాపూర్ లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికింది. రూ. 35 లక్షలకు లింగాల దశరథగౌడ్‌ సొంతం చేసుకున్నారు.  వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది ఈ లడ్డూను 30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే  ఈసారి 4 లక్షల 99 వేలు అధికంగా పలికి రికార్డు సృష్టించింది.

     

  • మరికొద్ది సేపట్లో బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం.. ఇద్దరి మధ్య పోటీ!

    HYD: ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుని లడ్డు వేలం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఈసారి ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ గత ఐదేళ్లుగా ప్రయత్నిస్తుండగా, ఎల్‌బీనగర్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి గత మూడేళ్లుగా పోటీ పడుతున్నారు. ఈసారి వీరిద్దరి మధ్య హోరాహోరీగా వేలం సాగుతుందని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లడ్డు ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

  • గణేష్ నిమజ్జనం.. చార్మినార్ వద్ద చిన్నారుల సందడి

    HYD: గణేష్ నిమజ్జనం సందర్భంగా చార్మినార్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. గణనాథుని శోభాయాత్రలో పాల్గొన్న చిన్నారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. జై గణేశా అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా చిందులేస్తూ నిమజ్జనంలో భాగమయ్యారు. నవరాత్రులు పూజలందుకున్న గణపతిని గంగమ్మ ఒడికి తరలిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

     

  • సెక్రటేరియట్ వద్దకు చేరుకుంటున్న బడా గణేశ్

    HYD: ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెక్రటేరియట్ వద్దకు చేరుకుంటోంది. భారీ గణపతి విగ్రహాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ వ్యూ పాయింట్ నుంచి ఈ దృశ్యాలను లైవ్లో అందుబాటులో ఉంచింది. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వైపుగా విగ్రహాన్ని తరలిస్తున్నారు. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది.

  • నిమజ్జనం వేళ.. ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినం

    హైదరాబాద్‌లో గణపతి నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ప్రధాన మార్గాల్లో వాహన రాకపోకలను నియంత్రించారు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు లారీలకు నగరంలోకి ప్రవేశం లేదు. ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగ్ రోడ్ ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. మెట్రోరైలు సేవలు రాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయి.

  • కారు రివర్స్ చేస్తుండగా టైర్ల కింద పడి బాలుడు మృతి

    రంగారెడ్డి: భాగ్యనగర్‌ కాలనీలో నివసించే గోపీకృష్ణ, మీనాక్షి దంపతుల కుమారుడు విరాట్‌(3) శుక్రవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఉండే అన్వేష్‌ ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. అది గమనించకుండా అన్వేష్‌.. తన కారు వెనక్కి తీస్తుండగా బాలుడు టైర్ల కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని హైదరాబాద్‌ తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు.

  • తేజస్‌ విమానానికి హైదరాబాదీ కంపెనీ దన్ను!

    HYD: భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల ఉత్పత్తి వేగవంతమైంది. దీనికి హైదరాబాద్‌లోని వెమ్‌‌టెక్నాలజీస్ సంస్థ తోడ్పాటు అందిస్తోంది.ఈసంస్థ తేజస్ విమానంలో అత్యంత కీలకమైన సెంట్రల్ ఫ్యూసలాజ్‌లను తయారు చేస్తోంది. ఇప్పటికే రెండు ఫ్యూసలాజ్‌లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు (హెచ్‌ఏఎల్)డెలివరీ చేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరుగుతున్న తీరుకు నిదర్శనం.

  • ప్రతి చిన్న కదలికపై నిఘా..

    HYD: పాతబస్తీలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. చారిత్రక చార్మినార్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, ఇతర భద్రతా బలగాలు కలిసి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

  • సంప్రదాయ దుస్తులతో యువత సందడి

    HYD: సికింద్రాబాద్‌ మెట్టుగూడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళీయులు ఓనం పండగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుడిలో ముగ్గులు వేసి పూలతో అలంకరించారు. సంప్రదాయ దుస్తులతో యువత సందడి చేశారు.